ఇంట్లో లాఫింగ్ బుద్ధా ఉంటే ఇన్ని లాభాలా.. ఏ దిక్కులో ఉంటే బెనిఫిట్ అంటే?

మనలో చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధాలను ఉంచడాన్ని ఎంతో ఇష్టపడతారు. ఎంత సీరియస్ గా ఉన్న వ్యక్తికి అయినా లాఫింగ్ బుద్ధాను చూస్తే వెంటనే నవ్వొస్తుంది. లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే అదృష్టం కలుగుతుందని చాలామంది అనుకుంటారు. లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే వ్యాపారంలో సమస్యలు తొలగిపోవడంతో పాటు మేలు జరుగుతుంది. ఇచ్చిన అప్పులు వసూలు కావడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కష్టాలు, అప్పుల బాధతో ఇబ్బందులు పడేవాళ్లకు లాఫింగ్ బుద్ధా వల్ల ఆ బాధలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో లాఫింగ్ బుద్ధా తోడ్పడుతుంది. ఈ విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. వ్యాపారం లేదా దుకాణాలు నిర్వహించే వాళ్లు లాఫింగ్ బుద్ధాను వాడితే ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మనపై చెడు దృష్టి ఉంటే కూడా లాఫింగ్ బుద్ధా వాడటం ద్వారా ఆ చెడు దృష్టి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. లాఫింగ్ బుద్ధా ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి శాంతి, సంతోషం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటే తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధాను ఉంచితే మంచిదని చెప్పవచ్చు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి కలగాలని అనుకుంటే పడమర దిక్కున ఈ లాఫింగ్ బుద్ధాను ఉంచాలి.

ఏ ఇంట్లో అయితే లాఫింగ్ బుద్ధా ఉంటుందో ఆ ఇంటికి ఆర్థికంగా కూడా భారీ స్థాయిలో లాభం కలుగుతుంది. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచితే శుభం కలుగుతుందని చాలామంది భావిస్తారు. లాఫింగ్ బుద్ధ జపాన్ నివాసి కాగా అతని పేరు హోతాయ్ కావడం గమనార్హం. లాఫింగ్ బుద్ధ క్రియల ద్వారా జ్ఞానం కలుగుతుందని చాలామంది భావిస్తారు.