రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గిందా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలకు సులువుగా చెక్!

red_blood_cells_9-sixteen_nine

ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిని రక్తహీనత సమస్య వేధిస్తుండటం గమనార్హం. అయితే కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలు సులువుగానే దూరమయ్యే అవకాశం ఉంటుంది. గోధుమ గడ్డి తీసుకోవడం ద్వారా రక్త హీనత సమస్య దూరమవుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లతో పాటు పోషకాలు సైతం గోధుమ గడ్డిలో సమృద్ధిగా ఉన్నాయి.

రక్తాన్ని శుద్ధి చేయడంలో గోధుమ గడ్డి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రతిరోజూ వెజిటేబుల్ జ్యూస్ తాగడంతో పాటు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ పొడి, అరస్పూన్ ఎండు ఖర్జూరం వేసి కలిపి తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది.

ఖర్జూరం పొడికి బదులుగా తేనెను కలిపి తాగినా కూడ హెల్త్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా సులువుగా దూరమవుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సమస్యలతో బాధ పడేవాళ్లు పాలు, చీజ్ లను దూరం పెట్టాలి. అదే సమయంలో టీ, కాఫీ, సోడా, ఆల్కహాల్ లను కూడా దూరం పెట్టాలి.

హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే మైకం, హైబీపీ, అలసట ఇతర ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే ఛాన్స్ అయితే ఉంటుంది.