తెలంగాణ విద్యుత్‌శాఖలో 100 ఉద్యోగ ఖాళీలు.. డిగ్రీ అర్హతతో?

తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురును అందించింది. 100 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఈ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం గమనార్హం. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ లలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఏదైనా డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. 44 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు 200 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇతర అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరబాద్, వరంగల్ లలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

2023 సంవత్సరం మే నెల 28వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. https://tsnpdcl.in/careers వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ స్థాయిలో వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.