“ఆరెంజ్” లేటెస్ట్ వసూళ్లు.. ఇక మీద ప్లాప్ కాదా?

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగా తన బర్త్ డే కానుకగా అయితే తన కెరీర్ లో డిజాస్టర్ సినిమా అయినటివంటి ”ఆరెంజ్” రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమా రీ రిలీజ్ అయితే ఊహించని లెవెల్ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. మొదట కేవలం రెండు రోజులకే ప్లాన్ చేయగా తర్వాత రెస్పాన్స్ చూసి అయితే ఏకంగా రన్ 5 రోజులకి పైగా నడిచింది. మరి ఈ రీ రిలీజ్ లో భారీ వసూళ్లు ఈ సినిమా రాబట్టగా ఇప్పటివరకు అయితే ఈ సినిమా 3.1 కోట్ల గ్రాస్ ని అందుకొని మరింత స్థాయిలో అయితే వసూళ్లు రాబడుతున్నట్టుగా సినిమా రిలీజ్ చేసిన యూనిట్ చెప్తున్నారు.

దీనితో అయితే ఆరెంజ్ సినిమా ఇక మీద డిజాస్టర్ కాదు అనే మాట ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో జెనీలియా అయితే హీరోయిన్ గా నటించగా విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అలాగే హారీష్ జై రాజ్ సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ ని అయితే అందించారు. అలాగే కొణిదెల నాగ బాబు అయితే నిర్మాణం వహించారు. మరి రీసెంట్ గా అయితే దర్శకుడు శంకర్ తో “గేమ్ ఛేంజర్” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.