పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. నెలకు ఏకంగా రూ.10,000 ఖాతాలో పొందే అవకాశం?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోస్టాఫీస్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. తక్కువ మొత్తం పొదుపు చేయాలని భావించే వాళ్లకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఏకంగా 30 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అందుతోంది. 7.4 శాతం వడ్డీతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

 

ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు జమ చేస్తే ప్రతి నెలా దాదాపుగా 10,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం 1,000 రూపాయలు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. ముగ్గురు కలిపి జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. మైనర్ పోస్టాఫీస్ అకౌంట్ ను ఓపెన్ చేస్తే అందుకు సంబంధించి గార్డియన్ కచ్చితంగా ఉండాలి. సమీపంలో ఉన్న పోస్టాఫీస్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

 

ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోగ్రాఫ్, దరఖాస్తు ఫామ్ ను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు రిస్క్ కూడా ఉండదు. ఈ స్కీమ్ గురించి అవగాహన ఉంటే సులువుగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్స్ పై దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.

 

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు మెచ్యూరిటీ వరకు ప్రతి నెలా వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది. ముందే ఈ డబ్బులను ఏదైనా కారణం వల్ల విత్ డ్రా చేయాలని అనుకుంటే 1 నుంచి 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది.