మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ఎవరు చూస్తున్నారో తెలుసుకోవాలంటే ఇలా చేయండి!

Facebook to say goodbye to its classic look

ప్రస్తుత కాలంలో స్మార్ట్ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే వీరందరూ కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యప్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఫేస్బుక్ ఉపయోగించే వారి సంఖ్య కూడా అధికమైంది. అయితే మీ ఫేస్ లో సమాచారంతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. అందువల్ల ఫేస్బుక్ ప్రొఫైల్ దుర్వినియోగం కాకుండా ఉండటానికి మీ ప్రొఫైల్ ను ఎవరైనా చూస్తున్నారా అనే విషయాన్ని మీరు సులువుగా కనిపెట్టవచ్చు. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ ఎవరైనా చూస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఇలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ప్రస్తుతం ఫేస్బుక్లో మన ప్రొఫైల్ కేవలం మన ఫ్రెండ్స్ మాత్రమే చూసే విధంగా పెట్టుకోవచ్చు. ఇతరులు చూడకుండా మనం మన ప్రొఫైల్ లాక్ చేసుకుని వెసులుబాటు కూడా ఉంది అయితే ఇలా లాక్ చేసుకుని నేపథ్యంలో మన ప్రొఫైల్ ఎవరెవరు చూస్తున్నారు మనం చాలా సులభంగా తెలుసుకోవచ్చు మరి మన ప్రొఫైల్ ఎవరు చూస్తున్నారు ఎలా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే…ముందుగా ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి లాగిన్‌ కావాలి. ఇక పేజీ ఓపెన్‌ అయిన తర్వాత ‘రైట్‌ క్లిక్‌’ చేయాలి. అందులో ‘వ్యూ పేజ్‌ సోర్స్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పుడు దానిపై క్లిక్‌ చేయాలి.

అలా చేసిన వెంటనే పేజీ సోర్స్‌ కోడ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘BUDDY_ID’ కోసం వెతకాలి. ఇందుకోసం కంట్రోల్‌+ఎఫ్‌ (ctrl+F) నొక్కి ‘BUDDY_ID’ అని టైప్‌ చేయాలి. ఇలా ‘BUDDY_ID’ పక్కన అనేక ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక ఐడీని కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్త ట్యాబ్‌ను ఓపెన్‌ చేసి ‘Facebook.com/ మీరు ఎంచుకున్న ఐడీ’ని పేస్ట్‌ చేయాలి. ఇలా చేయగానే మీ పేస్ బుక్ ప్రొఫైల్ ను ఎవరు చూసారో అనే వారి పేజీ ఓపెన్‌ అవుతుంది. ఈ ట్రిక్ ద్వారా ఫేస్ బుక్ లో మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు..