నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు, అనుభవం ఉన్న ఉద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. https://cbexams.com/nhidcl_march2023reg/home.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 2,15,900 రూపాయల వరకు వేతనం లభించే అవకాశాలు అయితే ఉంటాయి. గరిష్టంగా 56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఏప్రిల్ నెల 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
https://cbexams.com/nhidcl_march2023reg/home.aspx వెబ్ సైట్ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ లో న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మొబైల్ కు వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఆధారంగా లాగిన్ కావచ్చు. అర్హత, అనుభవం ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది.