మనలో చాలామంది చిన్నచిన్న ఆరోగ్య సమస్యల విషయంలో ఒకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఆ ఆరోగ్య సమస్యలే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం కలిగించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మనలో చాలామంది పాదాల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించారు. పాదాలలో తరచూ నొప్పి వస్తుంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
ఎక్కువ కొలెస్ట్రాల్ వల్ల గోళ్ల సంబంధిత సమస్యలు రావడంతో పాటు పాదాల గోళ్లు తేలికగా విరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాదాల గోళ్లు పసుపు లేదా మరో రంగులోకి మారితే పాదాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పాదాలలో తీవ్రమైన నొప్పి ఉంటే కొలెస్ట్రాల్ కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆక్సిజన్ సరఫరా లేకపోయినా పాదాల సంబంధిత సమస్యలు వస్తాయి.
పాదాలలో తిమ్మిరి రావడం, పదే పదే ఇన్ఫెక్షన్లు రావడం జరిగితే కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ దీర్ఘకాలంలో ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాదాలు తరచూ చల్లబడుతుంటే శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్థం చేసుకోవాలి.
తరచూ పాదాలు తిమ్మిరి పడుతున్నా వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది. కొన్ని ఆరోగ్య సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా దీర్ఘకాలంలో ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఈ తరహా ఆరోగ్య సమస్యల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తంలో పేరుకు పోయే చెడు కొలెస్ట్రాల్ శరీరానికి ఎంతో హాని కలిగిస్తుందని చెప్పవచ్చు.
పాదాల పగుళ్ల వల్ల కూడా దీర్ఘకాలంలో ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చెడు కొలెస్ట్రాల్ వల్ల శరీరానికి లాభం కంటే నష్టం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. పాదాలకు సంబంధించి ఎలాంటి సంకేతాలు కనిపించినా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిది.