నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఇంటర్వ్యూతో ప్రభుత్వ ఉద్యోగం పొందొచ్చట!

మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. అటెండెంట్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. తిరుమలగిరికి చెందిన ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

 

ఇంటర్, బీఎస్సీ, ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు మాత్రం గరిష్టంగా 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

 

పోస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 19,500 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎంసీఈఎంఈ గేట్ దగ్గర ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను అందజేయవచ్చు. అప్లికేషన్ తో పాటు సర్టిఫికెట్ల జిరాక్స్ లను యాడ్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. 2023 సంవత్సరం మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

 

ఏప్రిల్ నెల 5వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూ జరగనుంది. https://indianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులు అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే తక్కువ సమయంలోనే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.