మనలో చాలామంది ఇంటర్ చదివినా ఏ ఉద్యోగం రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ వాయు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మహిళలు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతిభతో పాటు ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు నాలుగేళ్ల పాటు సేవలను అందించాల్సి ఉంటుంది. సైన్స్, నాన్ సైన్స్ విభాగాలలో ఈ ఖాళీలు ఉండగా ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ప్రత్యేక పరీక్ష ద్వారా సైన్స్ విద్యార్థులు నాన్ సైన్స్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కనీసం 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. 21 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. కనీసం 153 సెంటిమీటర్ల ఎత్తు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ ఉద్యోగాల ఎంపిక జరుగుతుంది.
ఆన్ లైన్ లో రాత పరీక్ష రాయడంతో పాటు కటాఫ్ కు అనుగుణంగా మార్కులను సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్ నెస్ కచ్చితంగా ఉండాలి. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో బెనిఫిట్ కలగనుంది.