బాక్సాఫీస్ : మొదటి రోజు క్రేజీ రికార్డులు సెట్ చేసిన “దసరా” వసూళ్లు.!

లేటెస్ట్ గా పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన అసలు సిసలు పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన భారీ పాన్ ఇండియా ఇంటెన్స్ రా చిత్రం “దసరా” అనే చెప్పాలి.

నెవర్ బిఫోర్ ప్రమోషన్స్ తో రిలీజ్ కి వచ్చిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ కళ్ళు చెదిరే రికార్డులు సెట్ చేసింది. మరి డే 1 కి వరల్డ్ వైడ్ గా చిత్ర యూనిట్ 38 కోట్లు గ్రాస్ కొల్లగొట్టినట్టుగా కన్ఫర్మ్ చేయగా ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా క్రేజీ రికార్డులు సెట్ చేసిందట.

ఈ ఏడాది వచ్చిన వాల్తేరు వీరయ్య, వీరసింహ రెడ్డి నైజాం వసూళ్ల దగ్గర దగ్గర వసూళ్లు దసరా కి నమోదు కాగా యూఎస్ లో కూడా మొదటి రోజుకి వీర సింహ రెడ్డి లైఫ్ టైం వసూళ్లు ఈ సినిమా బ్రేక్ చేసేసింది. అంతే కాకుండా కర్ణాటక లో కూడా ఆ రెండు సినిమాల ఓపెనింగ్స్ ని బ్రేక్ చేయగా ఇక నాని రేంజ్ హీరోస్ లో అయితే దసరా కి ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.

కాగా తెలుగు స్టేట్స్ లో అయితే దసరా సినిమా 13 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టగా 26 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి ఇంతకు ముందు ఉన్న లైగర్ ని భారీ మార్జిన్ తో క్రాస్ చేసింది. దీనితో నాని అయితే మామూలు బ్యాటింగ్ చెయ్యలేదని చెప్పాలి.

టాక్ కూడా ఓ రేంజ్ లో ఉండడంతో సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరుతుంది అని చాలా మంది అంటున్నారు. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.