రైతులకు అదిరిపోయే శుభవార్త.. వడ్డీ లేకుండా రూ.5 లక్షలు రుణం పొందే ఛాన్స్!

20-million-farmers-listed-so-far-for-pm-kisan-dole

ఏ దేశంలో అయినా రైతులు సంతోషంగా ఉంటే మాత్రమే ఆ దేశ అభివృద్ధి జరగడం సాధ్యమవుతుంది. మన దేశంలోని రైతులు కొన్ని పంటల ద్వారా మంచి లాభాలను సొంతం చేసుకుంటుండగా మరికొన్ని పంటలు మాత్రం మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రైతులకు బెనిఫిట్ కలిగేలా వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రైతులకు కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డును సైతం అందిస్తుండగా సకాలంలో రుణం చెల్లించిన రైతులు 4 శాతం వడ్డీకే రుణం పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బెనిఫిట్ కలిగేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం 5 లక్షల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తోంది. వడ్డీ లేకుండా కర్ణాటక సర్కార్ ఈ స్కీమ్ లను అమలు చేస్తుండటం గమనార్హం.

వడ్డీ రహిత రుణ పరిమితిని ప్రభుత్వం పెంచడంతో రైతులకు బెనిఫిట్ కలగనుంది. 30 లక్షల మంది రైతులకు బెనిఫిట్ కలిగే విధంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భూ సిరి పేరుతో కర్ణాటక ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ఎవరైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటారో వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు. ఈ స్కీమ్ లో చేరిన రైతులకు 10,000 రూపాయల అదనపు సబ్సిడీ లభించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా స్కీమ్స్ ను అమలులోకి తెస్తే బాగుంటుంది. రైతులకు మేలు జరగడం కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో త్వరలో ఈ తరహాలో మరిన్ని స్కీమ్స్ అమలు కానున్నాయని తెలుస్తోంది.