హనుమన్ జయంతి రోజున ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం.. చెయ్యకూడని తప్పులివే!

Hanuman-Chalisa

ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతి అనే సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని గ్రాండ్ గా జరుపుకుంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కష్టాలు తీరతాయని చాలామంది భావిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కోరిన కోరికలు తీరడంతో పాటు కష్టాలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

హనుమాన్ జయంతి రోజున కాషాయ రంగు దుస్తులను ధరించడం వల్ల లాభం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజున నెయ్యిలేదా నూనె దీపం వెలిగిస్తే మంచిది. గుడికి వెళ్లి కుంకుమను సీతాదేవి పాదాలకు రాయడం ద్వారా కోటి జన్మల పుణ్య ఫలాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హనుమాన్ జయంతి రోజున ఆయన భక్తులు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు.

ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. సుందరకాండ పారాయణం క్రమం తప్పకుండా చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. హనుమంతుని ఆశీస్సులు ఉంటే బాధలు కూడా సులువుగా తొలగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. హిందువులకు హనుమంతుని పుట్టినరోజు వేడుక ఎంతో ముఖ్యమైనది.

హనుమాన్ జయంతి రోజున వయస్సులో పెద్దవాళ్లను పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హనుమంతుడిని పూజించడం ద్వారా చెడు దృష్టి కూడా తొలగిపోతుందని తెలుస్తోంది. హనుమాన్ జయంతి రోజున దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.