ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య బంధం బలమైనది కాదని చెప్పాలి చిన్నపాటి గొడవలు వస్తే చాలు వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ విడాకుల వరకు వెళ్తున్నారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తమ భర్త తనను ఎన్నిసార్లు మోసం చేసిన, చెడు తిరుగులు తిరిగిన, తాగొచ్చి హింసలు పెట్టినా కూడా కొందరు మహిళలు భర్త నుంచి విడిపోవడానికి ఇష్టపడరు. భర్తను క్షమించి వారితోనే జీవనం సాగించడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి మహిళలపై చేసిన సర్వేలో కొందరు మహిళలు చెప్పిన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నా భర్త మరో మహిళతో చాలా కాలంగా సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను ఆ సమస్యను పరిష్కరించగలను అని నమ్మాను. అందుకే నా భర్తనుండి విడిపోలేదు. మనసు మార్చుకుంటాడని ఎదురు చూశాను. అతనితో మరింత సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాను.సెక్స్ పరంగా నేను దగ్గరైతే నా భర్త మరో మహిళ కోసం వెళ్లడు కదా అని అనుకున్నాను అని మహిళ చెప్పడం గమనార్హం.
నా స్నేహితురాలి భర్త.. చాలా మంది మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఆ విషయం నా స్నేహితురాలికి కూడా తెలుసు. కానీ.. అతను ఎంత మందితో తిరిగినా తిరిగి ఇంటికే వస్తాడని…. భర్త బాధ్యతలు, తండ్రి బాధ్యతలు నిర్వర్తిస్తాడని అందుకే వదిలిపెట్టడం లేదని నా స్నేహితురాలు చెప్పింది.’ అంటూ ఓ మహిళ తెలియజేయడం గమనార్హం.
మరో మహిళ చెప్పిన దాని ప్రకారం ఆమె భర్త ఇంటి యజమానితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.
అయితే ఆ విషయంలో నా భర్తదే తప్పు అని నేను అంగీకరించలేకపోయాను.ఆ ఇంటి యజమానురాలే నా భర్తను వలలో వేసుకుంది అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ నిజానికి తప్పు చేసింది నా భర్తే
అని తెలిసినప్పటికీ నా భర్త నుంచి విడిపోవడానికి సాహసించలేకపోయానని చెప్పుకొచ్చింది.