మామిడి టెంక పడేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..!

Mango: వేసవికాలం మొదలవగానే అందరికీ గుర్తొచ్చేవి తాటి ముంజలు, మామిడి పండ్లు, పుచ్చకాయలు. వేసవి కాలంలో ఈ పండ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఐతే వీటిలో ఉన్న విత్తనాలు మాత్రం పడేస్తున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ మామిడి పండ్లు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. అందువల్ల మామిడి పండ్లు తిని వీటిలో ఉన్న టెంకలను వాడేస్తుంటారు. కానీ కానీ ఎందుకు పనికి రావని పడేసే ఆ మామిడి టెంక ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. మామిడి టెంకల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మామిడి టెంకలు ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడితో సమానంగా కొంచం జీలకర్ర, మెంతి పొడి కలిపి ప్రతిరోజూ మనం తీసుకొనే ఆహారంతో పాటు తీసుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు మామిడి టెంకల పొడితీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇది జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

మహిళలు రుతుక్రమం సమయంలో వచ్చే కడుపు నొప్పి, కాళ్ళనొప్పులు వంటి సమస్యలను నివారించడంలో మామిడి టెంకల పొడి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ ఆహారంలో ఇప్పుడే తీసుకోవటం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. మామిడి టెంక లో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరంలోని ఎముకలు, కండరాలు, పళ్ళు దృఢంగా ఉండేలా చేస్తాయి. ఈ పొడి ఆహారంలో కలిపి తీసుకోవటం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.