Soya Chunks: మిల్ మేకర్స్ ని ఇష్టంగా తింటున్నారా.. ఇది తెలిస్తే ఇక తినమన్నా తినరు..!

వెజిటేరియన్లలో అత్యంత ప్రియమైన ఆహార పదార్థాల్లో ఒకటి సోయా చంక్స్ లేదా మీల్ మేకర్స్. వీటిని ప్రోటీన్ సరఫరా కోసం నాన్-వెజ్‌కు ఆల్టర్నేటివ్‌గా కూడా వాడతారు. అయితే ఇవి అతిగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మిల్ మేకర్స్ ఎక్కవగా తినడం జంక్ ఫుడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని చెబుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సోయా చంక్స్ అల్ట్రా-ప్రాసెస్డ్ ప్రొడక్ట్. వీటిలో 80–90% రిఫైన్డ్ ఫ్లోర్ ఉంటుంది. అంటే, అవి సూపర్‌ఫుడ్ లాంటి ప్రోటీన్ ప్యాక్ అయినా, రియల్ పోషకాల కంటే.. కేలరీలు ఎక్కువగా ఇస్తాయి. ఫలితంగా ఇవి ఆరోగ్యానికి జంక్ ఫుడ్ లా పని చేస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని చెబుతున్నారు. రిఫైన్డ్ ఫ్లోర్ కారణంగా రక్తంలో షుగర్ స్పైక్స్ వస్తాయి, అది ఇన్‌ఫ్లమేషన్‌కు దారి తీస్తుంది. దీని వల్ల హృదయం, జాయింట్లు, మెటాబాలిజం, మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.

అంతేకాదు గట్ హెల్త్ కూడా సోయా చంక్స్ వల్ల ప్రభావితమవుతుంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ కావడం వల్ల గ్యాస్, బెల్లీ డిస్కమ్ఫర్ట్, డయారియా వంటి సమస్యలు రావచ్చని న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్ హెచ్చరిస్తున్నారు. అదనంగా వీటిలో యాంటీ-న్యూట్రియెంట్స్ ఉండడం వల్ల శరీరం అవసరమైన విటమిన్లు, మినరల్స్ గ్రహించడంలో సమస్యలు ఎదురవుతాయి.

అందువల్ల వెజిటేరియన్లు కూడా సోయా చంక్స్‌ను తరచుగా, ఎక్కువగా కాకుండా, పరిమితంగా వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఫ్రెష్ సోయా లేదా నాన్-ప్రాసెస్డ్ వెర్షన్ వాడడం, వంటలో మితంగా వాడటం, ఆరోగ్యాన్ని కాపాడే మార్గమని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్ సోయా ఎక్కువగా తీసుకోవడం జంక్ ఫుడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని చెబుతున్నారు. మన గట్ హెల్త్, బ్లడ్ షుగర్, ఇన్‌ఫ్లమేషన్ మీద దీని ప్రభావం నెగటివ్‌గా ఉంటుందని హెచ్చరించారు.

వీటిని జాగ్రత్తగా వాడితే మాత్రమే ఆరోగ్యానికి హానీ తక్కువగా ఉంటుంది. అలాగే సోయా చంక్స్‌తో వంటలు చేసినప్పటికీ, శరీరానికి అవసరమైన పోషక విలువలను మించకూడదని సూచిస్తున్నారు. ఈ విధంగా జాగ్రత్తగా వాడితే.. ఆరోగ్యానికి హానికర ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు.