Pinnelli Brothers Remanded: పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్… నెల్లూరు జైలుకు తరలింపు

Pinnelli Brothers Remanded: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం వీరిద్దరూ మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట లొంగిపోయారు. విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను పోలీసులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.

Vizag Data Center: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనులపై సుందర్ పిచాయ్‌తో లోకేశ్ చర్చ

Jagadish Reddy: కాంగ్రెస్ హయాంలో మళ్లీ ‘హత్యల రాజ్యం’: జగదీశ్ రెడ్డి ఫైర్

నేపథ్యం ఇదీ.. ఈ ఏడాది మే 24న మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6 గానూ, వెంకట్రామిరెడ్డిని ఏ7 గానూ నిందితులుగా చేర్చారు.

న్యాయస్థానాల్లో చుక్కెదురు ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సోదరులు తొలుత హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. పిటిషన్‌ను కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం, రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ గడువు ముగుస్తుండటంతో అనివార్యంగా వారు గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోయారు.

Cine Critic Dasari vignan About CM Revanth Reddy Buper Offer To Nagarjuna || Annapurna Studios | TR