Akhanda 2 Thaandavam Movie Review: ‘అఖండ : తాండవం’ మూవీ రివ్యూ!

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
తారాగణం : నందమూరి బాలకృష్ణ, సంయుక్త, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, ఆది పినిశెట్టి తదితరులు
సంగీతం: థమన్ ఎస్, చాయాగ్రహణం : సీ రాంప్రసాద్, సంతోష్ డీ డెటాకే, కళ : ఏఎస్ ప్రకాష్, కూర్పు : తమ్మిరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
విడుదల : డిసెంబర్ 12, 2025

Akhanda 2 Thaandavam Movie Review: 2021 డిసెంబర్ లో నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన స్పిరిచ్యువల్ యాక్షన్ థ్రిల్లర్ ;అఖండ’ కి సీక్వెల్ గా ‘అఖండ : తాండవం’ ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. గత వారం విడుదల కావాల్సిన ఈ మెగా మూవీకి ఆర్ధిక, న్యాయపర సమస్యలు ఎదురై విడుదల రద్దయింది. ఇప్పుడు తాజా తేదీ తో ఈ రోజు విడుదలైన ‘అఖండ 2’ హైప్ కి తగ్గట్టు బాక్సాఫీసు హిట్ గా మెప్పిస్తుందా? మరోసారి బాలయ్య –శీనయ్య కాంబినేషన్ ఎలా పనిచేసిందో చూద్దాం…

కథేమిటి?
2020 లో లడఖ్ లో వాస్తవాధీన రేఖ దగ్గర చైనా చొరబాటుని ఎదుర్కొన్న భారత సైని కులకీ, చైనా దళాలకీ మధ్య చెలరేగిన ఘర్షణనలని ఆధారంగా చేసుకుని ఈ కథ వుంటుంది. ఆ ఘర్షణల్లో కొడుకుని కోల్పోయిన చైనీస్ జనరల్ (సాంఘే షెల్ట్రిమ్) భారత్ మీద పగబడతాడు. భారత్ ని కోలుకోలేని దెబ్బ తీయాలంటే మత విశ్వాసాలని విచ్చిన్నం చేయాలని, అవినీతి పరుడైన భారత మంత్రి (కబీర్ దుహన్ సింగ్) తో కుట్ర పన్నుతాడు.

ఈ కుట్రలో భాగంగా అప్పుడు జరుగుతున్న మహా కుంభమేళాని టార్గెట్ చేసి ఈ గంగానదిలో వైరస్ కలుపుతారు. దీంతో ప్రజల్లో కల్లోలం రేగి మత విశ్వాసాల్లో నమ్మకం పోయే పరిస్థితి నెలకొంటుంది. దీంతో వంటనే అప్రమత్తమై దేశ ప్రధాని రంగంలోకి దిగుతాడు. డీఆర్డీఓ కి చెందిన యువ సైంటిస్టు జనని (హర్షాలీ మల్హోత్రా) ఆ వైరస్ కి విరుగుడు వ్యాక్సీన్ కనిపెట్టిందని తెలుసుకున్న ప్రధాని ఆ వ్యాక్సిన్ ని భారీ యెత్తున ఉత్పత్తి చేసేందుకు ఆమెని లడఖ్ పంపుతాడు. ఈ విషయం తెలుసుకున్న చైనీస్ జనరల్ ఆమెని చంపేందుకు బృందాల్ని పంపుతాడు. జనని బాల మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురు. ఈమెని కాపాడేందుకు అఖండ (బాలకృష్ణ ఎంట్రీ ఇస్తాడు.

ఈ బాల మురళీ కృష్ణ ఎవరు? చిన్న వయసులోనే అతడి కూతురు జనని పెద్ద సైంటిస్టుగా ఎలా మారింది? అఖండ ఎవరు? హిందూ మతానికి హాని కలక్కుండా అతను చైనీస్ కుట్రని ఎలా భగ్నం చేశాడు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ!

ఎవరెలా చేశారు?
‘అఖండ’ లో అఘోరాగా అపూర్వంగా నటించిన బాలకృష్ణ ఈ సీక్వేల్లో వృద్ధ అఘోరాగా రౌద్రంగా కన్పిస్తారు. థియేటర్ ని ఊపేసే పవర్ఫుల్ నటన, గగుర్పాటు కల్గించే పోరాటాలు, దద్దరిల్లే మాస్ డైలాగులూ ఈ సీనియర్ అఘోరా పాత్రకి బలాన్నిచ్చాయి. అయితే మొదటి భాగంలో బాలకృష్ణ కొత్తావతారంగా థ్రిల్ చేసిన అఘోరా పాత్రతో పోల్చుకుంటే ఆ స్థాయిలో వుండదు.అదే పాత్ర తిరిగి రిపీట్ అయినప్పుడు కొత్త తాంత్రిక విద్యలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేయాల్సింది ఆ పని చేయలేదు. పైగా ఫస్టాఫ్ లో చేసేదేమీ వుండదు. సెకండాఫ్ లో ఉగ్రావతారం దాలుస్తారు. ఇది ఫ్యాన్స్ కీ, మాస్ కీ

ఈ సినిమాలో సీనియర్ అఖండ కాక, మొదటి భాగంలోని యంగ్ అఖండగా, ఇప్పుడు బాల మురళీ కృష్ణగా మూడు పాత్రల్లో కన్పించినా ప్రధాన పాత్ర, కథ సీనియర్ పాత్రతోనే. అయితే ఈసారి కథతో బాటు విలన్ పాత్రలూ సహకరించక సీనియర్ అగోరా గాండ్రింపులు వర్కౌట్ కాలేదు. ‘అఖండ’ లో లాగే ఎస్సరి కూడా విలన్లు చాలా వీక్. బాలమురళీ కృష్ణగా సంయుక్తతో ‘జాజికాయ’ డ్యూయెట్ కూడా వీకే.

ఆదిపినిశెట్టి, గుహన్ కబీర్ సింగ్ లు వీక్ విలన్లుగా నటించిన సీన్లు నిరాశపరుస్తాయి. అలాగే హీరోయిన్ సంయుక్తది చిన్న పాత్ర. మధ్యలో మాయమైపోతుంది. కానీ యువ సైంటిస్టు పాత్రలో హర్షాలీ మల్హోత్రా పాత్ర, నటన యూత్ అప్పీల్ తో ఆకట్టుకుంటాయి.

అయితే లిప్ సింక్ పట్ల శ్రద్ధ వహించి వుండాల్సింది. ఈసారి టాలెంట్ వున్న నటులున్నారు గానీ, వాళ్ళ పాత్రలు, నటనలు సినిమాని నిలబెట్టేందుకు ఏమాత్రం తోడ్పడలేదు. బోయపాటి ఎందుకో కంగారు కంగారుగా మేకింగ్ చేసినట్టుంది.

సాంకేతికాల మాట?
సాంకేతికాల విషయానికి వస్తే, తమన్ సంగీతం కూడా ‘అఖండ’ స్థాయిని అందుకో లేకపోయింది. కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తప్ప పాటలు కూడా కూర్చోబెట్టే విధంగా లేకపోవడం ఇంత పెద్ద సినిమాకి దెబ్బ. ఎక్కువ భాగం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లౌడ్ గా చెవుల కిబ్బందిగా తయారైంది. సీ రాంప్రసాద్, సంతోష్ ల కెమెరా వర్క్ మాత్రం క్లాస్ గా వుంది. కానీ సీజీ వర్క్ మాత్రం నాసిరకంగా వుంది. రాం –లక్ష్మణ్ ల ఫైట్స్ మరీ థ్రిల్ కల్గించవు గానీ ఓకే అన్పిస్తాయి. మొత్తానికి సాంకేతికంగా కూడా క్వాలిటీతో లేకపోవడం అఖండ తాండవానికి మైనస్ అయ్యింది.

ఇంతకీ కథెలా వుంది?
ప్రకృతికి హాని చేయవద్దన్న కథతో ‘అఖండ’ తీశారు. ప్రకృతి మీదా పసివాళ్ళ మీదా చెయ్యేస్తే శివుడూరుకో డన్నారు. ఇందుకు లయకారుడైన శివుడి అంశని అఖండ అనే అఘోరా పాత్రలో ప్రతిష్టించి పోరాటానికి దింపారు. సింపుల్ గా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ హై కాన్సెప్ట్ కథ. ప్రకృతి వినాశక శక్తులు వర్సెస్ అఖండ అనే శైవ సాధువు స్పిరిచ్యువల్ యాక్షన్ జానర్ కథగా ఐడియా బావుంది. ఈ ఐడియాని బోయపాటి తన రెగ్యులర్ ఫ్యాక్షన్ తరహా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ గా మార్చేసి ప్రకృతి- దైవం- మనం అన్న సున్నిత బంధాన్ని ఫీల్ కాకుండా చేశారు. అయినా అది పెద్ద హిట్టయ్యంది.

ఈసారి అంత కథా బలం, భావోద్వేగ చైతన్యం, బలమైన పాత్రలూ లేకపోవడంతో తాండవం ఫ్యాన్స్ అండ్ మాస్ సెక్షన్ సినిమాగా మారిపోయింది. ఈసారి హిందూ మతం మీద విదేశీ కుట్ర అనే కథ పానిండియా స్థాయిలో పెద్ద హిట్టవ్వాల్సింది. ఈ అవకాశాన్ని కేవలం బ్యాడ్ కంటెంట్ కారణంగా కోల్పోయింది.

ఫస్టాఫ్ గురించి చెప్పుకోవడానీకేమీ లేదు. అఖండ పరిచయంతో కొద్ది సేపు బాలకృష్ణ కన్పించి మళ్ళీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్ దాకా రాడు. అంతవరకూ అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణగా ఒక మాస్ ఫైట్ చేసి, హీరోయిన్ తో ఓ డ్యూయెట్ తో సరిపెట్టుకుంటాడు. పైగా చైనా, టిబెట్, మణిపూర్ సమస్యలంటూ ఫస్టాఫ్ గందరగోళంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ లో సీనియర్ అఖండగా బాలకృష్ణ వచ్చి చేసే యాక్షన్ సీనుతో ఫస్టాఫ్ ముగించారు. ఇంతవరకూ ఫస్టాఫ్ లో కథ ఏం చూశామంటే ఏమీ లేదు. కనీసం బాలకృష్ణ- బోయపాటి గత సినిమాల్లో వున్నా ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ స్థాయిలో కూడా ఈయక్షన్ సీన్ వుండదు. కారణం కథలో, పాత్రలో ఎమోషన్స్ లేకపోవడమే. లేని ఎమోషన్స్ తో హంగామా తప్ప ఎం లేదు.

ఇక సెకండాఫ్‌ అదే చైనా కుట్రలతో రొటీన్‌ పంథాలో సాగిపోతుంది. ఇందులో ఆది పినిశెట్టి తో వచ్చే ఎపిసోడ్ అర్ధం పర్ధం లేనిది. క్లయిమాక్స్ లో అఖండ మత బోదనల్లో బలం కూడా వుండదు. బోయపాటి శ్రీను ఫస్టాఫ్ తో బాటు సెకండాఫ్ ని కూడా నిలబెట్టలేని బలహీన దర్శకత్వంతో పూర్తిగా ‘అఖండ : తాండవం’ ని వృధా ప్రయత్నంగా మిగిల్చాడు.

రేటింగ్ : 2 / 5

పవన్ శాపం || Advocate Bala Fires On Pawan Kalyan Telangana Comments | Chandrababu || Ycp Vs TDP ||TR