29 Movie: ‘29’.. చిత్రం టైటిల్ టీజ‌ర్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

29 Movie: ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ స్టూడియో, జీ స్క్వాడ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ మూవీకి ‘29’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. బుధ‌వారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

29 సినిమాకు ర‌త్న‌కుమార్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రియ‌లిజం, ఫీల్ గుడ్, రా ఎమోష‌న్స్‌తో యూనిట్ స్టోరీతో ఈ సినిమాను ఈయ‌న రూపొందిస్తున్నారు. మెయ్యాద మాన్‌, ఆడై, గులు గులు వంటి విజ‌యవంత‌మైన చిత్రాల త‌ర్వాత గ్రిప్పింగ్ స్టోరీతో, హృద‌యాల‌ను హ‌త్తుకునే మాన‌వ సంబంధాల‌ను తెలియ‌జేసేలా, ప్రేమ గొప్ప‌దనాన్ని తెలియ‌జేసేలా ప్రేమ క‌థా చిత్రంగా 29 రానుంది.

విదు, ప్రీతి అస్రాని ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. వారి మ‌ధ్య కెమిస్ట్రీ, పాత్ర‌ల్లోని గాఢ‌త 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ కానున్నాయి.

వైవిధ్య‌మైన సంగీతాన్ని అందించే సేన్ రోల్డ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండ‌టంతో మ‌రోసారి డిఫ‌రెంట్ మ్యూజిక్‌ను ఆస్వాదించ‌వ‌చ్చున‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు.

కార్తికేయ‌న్ ఎస్‌, లోకేష్ క‌న‌క‌రాజ్ నిర్మిస్తోన్న 29 సినిమా.. కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను ప్రోత్స‌హిస్తోన్న స్టోన్ బెంచ్ స్టూడియో, జీ స్క్వాడ్ బ్యాన‌ర్ నుంచి వస్తోన్న మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంగా నిల‌వ‌నుంది.

29 టైటిల్ లుక్, గ్లింప్స్ ద్వారా సినిమా వైబ్‌ను ఆడియెన్స్‌ను కొంత ప‌రిచ‌యం చేశారు మేక‌ర్స్‌. దీంతో 29 సినిమాను చూడాల‌నే ఆస‌క్తి అంద‌రిలో మ‌రింత‌గా పెరిగింది.

ప‌వ‌ర్‌ఫుల్‌ క్రియేటివ్ టీమ్‌, ఆసక్తికరమైన కథా నేపథ్యం కాంబోలో రూపొందుతోన్న ‘29’ సినిమా 2026లో తప్పక చూడాల్సిన అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.

అర్బన్ నక్సల్స్ పై కుట్ర || Prof Haragopal About Urban Naxals || Maoist Hidma Enconter Case || TR