ఇంట్లో దీపం పెట్టే సమయంలో పాటించాల్సిన నియామాలు ఏంటో తెలుసా?

దేవుళ్లను పూజించే వాళ్లలో చాలామంది ఉదయం సమయంలో సాయంకాలం సమయంలో దీపారాధన చేయడానికి ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. దీపం పరబ్రహ్మ స్వరూపం కాగా దీపారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. దీపాన్ని వెలిగించే సమయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత దీపాలను వెలిగిస్తే మంచిదని చెప్పవచ్చు. ఏదైనా కారణం వల్ల సాయంత్రం సమయంలో స్నానం చేయడం సాధ్యం కాని పక్షంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. దీపారాధన వల్ల కుటుంబం వృద్ధిలోకి రావడంతో పాటు మనలో జ్ఞానం పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దీపారాధాన చేసిన ఇంట్లో పిల్లలు వృద్ధిలోకి రావడంతో పాటు శాంతి నెలకొంటుంది.

దీపారాధన చేయడం వల్ల పీడలు, గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వ్యాపారస్థలంలో దీపారాధన చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. దీపారాధన చేసే ఇంటి దరిదాపుల్లోకి దుష్టశక్తులు రావు. రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలిచి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

దీపానికి నమస్కరించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె జ్యోతులను వెలిగించడానికి మంచిదని చెప్పవచ్చు. కనీసం రెండు వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని చెప్పవచ్చు. స్టీల్, ఇనుప ప్రమిధలలో దీపం వెలిగించడం ఏ మాత్రం మంచిది కాదు.