మనలో చాలామంది వాస్తును ఎంతగానో నమ్ముతారు. వాస్తును పాటించే వాళ్లు ఇంట్లో ఏర్పాటు చేసుకునే పూజగది విషయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పూజగది విషయంలో తప్పులు చేస్తే మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూజగదిని ఎప్పుడూ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకోవాలి తప్ప బేస్ మెంట్ లో ఏర్పాటు చేసుకోకూడదు. పూజ గదిని ఈశాన్యం లేదా తూర్పు లేదా పశ్చిమ దిక్కున ఏర్పాటు చేసుకుంటే మంచిది.
పూజగది ఏర్పాటు చేసుకోవడానికి తగినంత స్థలం లేని వాళ్లు ఈశాన్య దిక్కులో పూజగదిని ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ రూమ్ లో పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు. పూజగదిలో విగ్రహాలను ఉత్తరం దిక్కు వైపు పెట్టకూడదు. దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టినా చెడు ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
దేవుని గదిలో విగ్రహాలను పెట్టే వాళ్లు గోడకు ఒక అంగుళం దూరంలో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. దేవుని విగ్రహాల ముందు మాత్రమే దీపాలను వెలిగించాలి. పూజ సామాన్లను భద్రపరచాల్సి వస్తే ఇంట్లో ఆగ్నేయం దిక్కున భద్రపరిస్తే మంచిది. నైవేద్యం పెట్టే సమయంలో విగ్రహం ఎదురుగా నైవేద్యం పెట్టాలి. పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పూజ గదికి రెండు తలపులు ఉన్న ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
పూజగదిని ఏర్పాటు చేసుకునే వాళ్లు ఆ గదికి తప్పనిసరిగా గడప ఉండేలా చూసుకోవాలి. పూజగదికి ఎల్లప్పుడూ లేత రంగులే వేస్తే మంచిది. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని పూజగదికి వేస్తే మంచిది. మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి.