Radish Benifits: ముల్లంగి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Radish Benefits: మనం రోజూ ఉపయోగించే కూరగాయలలో ముల్లంగి ఒకటి. ఇది బంగాళాదుంప, బీట్ రూట్, క్యారెట్ ల లాగా భూమిలో పండుతుంది అందుకే వీటిని రూట్ వెజిటబుల్స్ (దుంపలు) అంటారు. ఆసియాలో దీనిని పూర్వం నుండి పండిస్తున్నారు, అప్పట్లో ఇది శీతాకాలంలో మాత్రమే లభించేది. వ్యవసాయ పద్ధతులలో మార్పుల వల్ల ఇప్పుడు ఇది మార్కెట్ లో సంవత్సరం పొడవునా లభిస్తుంది. దీనినే ఇండియా లో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వినియోగిస్తారు.

ముల్లంగిని సలాడ్స్, సూప్స్, కూరలు చేసుకొని తింటుంటారు. మండలం జిల్లా ఆరోగ్యానికి మేలు చేసే అనేక విలువైన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనిని పచ్చిగా తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది, కాకపోతే దీనిని పచ్చివిగా తింటే క్యారెట్ లాగా తీయగా ఉండదు, కొంచెం కారంగా ఉంటుంది. సౌత్ ఇండియా లో అయితే ముల్లంగిని ఎక్కువగా సాంబార్ చేసుకొని తింటుంటారు. ముల్లంగిని కూరలలో చేర్చడం వల్ల వాటి రుచి రెట్టింపవుతుంది. అందువల్ల మీరు తినే రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

• పైల్స్: ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో చాలా మంది ఎక్కువగా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. దీని వల్ల ఎక్కువ మంది పైల్స్ వ్యాధికి గురవుతున్నారు. ముల్లంగి శరీరంలో ఉన్న
విషాలను బయటకు నెట్టే గుణం అధికంగా ఉంటుంది. ముల్లంగి జ్యూస్ జీర్ణక్రియను మెరుగు పరిచే పైల్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. పైల్స్ వ్యాధితో బాధ పడేవారు ముల్లంగి జ్యూస్ ను తీసుకోవడం వల్ల అధికం కాకుండా కాపాడుతుంది.
• మలబద్ధకం: మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ముల్లంగి ని తమ ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియను సాఫీగా అయ్యేలా చేస్తుంది. ఫలితంగా మలబద్ధకం తగ్గి విరేచనం సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. మిలన్ డే కార్బో హైడ్రేట్లు, పీచు పదార్థం మీ బరువు తగ్గడం లో ఉపయోగపడుతుంది.
• క్యాన్సర్: ముల్లంగి లో యాంటీ క్యాన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి ని మనం రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడం వలన వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
• చర్మ ఆరోగ్యం: ముల్లంగిలో విటమిన్ సి, పాస్ఫరస్, జింక్ మరియు విటమిన్ బి పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముల్లంగి గింజలను నానబెట్టి ముఖానికి పూసి కాసేపు ఆరనిచ్చి కడిగితే చర్మం మీద ఉన్న మొటిమలు, మచ్చలు దూరమవుతాయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
• మూత్రంలో మంట: ముల్లంగి ఆకులను నీటిలో వేసి కషాయం గా కాచి అందులో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే మూత్రం పోసేటప్పుడు మంట రాదు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ముల్లంగిని దూరం ఎందుకు చేసుకుంటారు, ఈ రోజు నుండే అయినా ముల్లంగి దూరంగా ఉండకండి.