Anjeer Side Effects: అంజీర్ పండ్లను ఎక్కువగా తింటున్నారా.. ఈ సమస్యలు తప్పవు?

Anjeer Side Effects: అంజీరా పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంజీరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరగటానికి ఇవి తోడ్పడతాయి. ముఖ్యంగా అంజీరా పండ్లు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. అంజీర పండ్లు తినటం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ వీటిని ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

అంజీర పండ్లు మలబద్ధకాన్ని నివారించే గుణం ఎక్కువగా ఉంటుంది. అంజీర పండ్లు ఎక్కువగా తినటం వల్ల విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంజీర పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ పండ్లు ఎక్కువగా తినటం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉన్నందున శస్త్రచికిత్స చేయించుకున్నవారు అంజీర్ పండ్లు తినకపోవడమే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.

అంజీర పండ్లలో క్యాలరీలు అత్యధికంగా ఉండటం వలన అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీటిని తినటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఈ పండ్లను మరీ ఎక్కువగా తినటం వలన కేలరీలు ఎక్కువై కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అంజీర పండ్లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలోని క్యాల్షియం మొత్తాన్ని గ్రహించి శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడేలా చేస్తాయి. రుతుక్రమం సమయంలో అంజీర పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.. వీటి వలన కడుపు ఉబ్బరం , కడుపు నొప్పి ఎక్కువ అవ్వటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుచేత ఏ ఏ ఆహారాన్ని అయినా మితిమీరి తినటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.