Breaking news: తెలంగాణ సర్కార్ కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో కేటీఆర్ ను అరెస్టు చేయాలని పట్టుదలతో ఉన్నారు ఈ క్రమంలోనే తనని అరెస్టు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ పై కేసు కూడా నమోదు కావడం గమనార్హం.
కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ కారు రేసుకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తనని అరెస్టు చేయడం కోసం తెలంగాణ సర్కార్ గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారు అయితే గవర్నర్ ఈయన అరెస్టుకు గ్రీన్స్ సిగ్నల్ ఇవ్వడంతో ఏ క్షణమైనా ఈయన అరెస్ట్ కావచ్చని అందరూ భావించారు. ఇక ఈ శుక్రవారం కచ్చితంగా అరెస్టు అయ్యేది కేటీఆర్ అంటూ తెలంగాణ రాజకీయాలలో చర్చలు జరిగాయి.
అనుకున్న విధంగానే ఈ శుక్రవారం కేటీఆర్ ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ పై తాజాగా కేసు నమోదు కావడం విశేషం ఈ కారు రైస్ కు సంబంధించి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ పై కూడా ఏసీబీ కేసును నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా కేటీఆర్ ఏవన్ ముద్దాయిగా కేసు నమోదు అయింది ఏ క్షణమైనా ఈయనని పోలీసులు అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది.