KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పాలన చూసి ప్రజలందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బయటకు వస్తే ప్రజలు తన వీపు పగలకొట్టడం ఖాయమని తెలిపారు.
రేవంత్ సెక్యూరిటీ లేకుండా వస్తే ప్రజలు చేసే పని అదేననీ తెలిపారు. అందుకే ఆయన భయంతో ఎక్కడికి వెళ్లినా తన వెంట సుమారు 500 మంది వరకు సెక్యూరిటీ ఉండేలా చూసుకుంటారని కేటీఆర్ తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు.కేసీఆర్ దమ్ముంటే రా అంటాడు. నిజంగా ఆయనకు అంత సీన్ ఉందా. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే బీఆర్ఎస్ వాళ్లనే ఆయన తట్టుకోలేకపోతుండు. అలాంటి రేవంత్ రెడ్డికి కేసీఆర్ రావాలంట. నీకు ఇది అవసరమా చిట్టి నాయుడు చిట్టెలుకవి ఆయనను ఎదుర్కొనేందుకు కేసీఆర్ కావాలా? అంత లేదు నీకు అని మొన్న మేం చెప్పినం.
నేను నీలాగా ఆవారా కాదు నేను ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నాను. ఎంతో సంస్కారం నేర్చుకున్నాను కానీ నువ్వు మాట్లాడే విధానం చూసి నీకు ఇదే విధంగా మాట్లాడటమే కరెక్ట్ అని భావించామని కేటీఆర్ తెలిపారు. ఇక ఈయన క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరిని అరెస్టు చేయాలో తన క్యాబినెట్ తో చర్చించి అరెస్టులు చేయిస్తున్నారని తెలిపారు. క్యాబినెట్ మీటింగ్లో చర్చించాల్సింది అరెస్టుల గురించి కాదని ప్రజల సమస్యల గురించి రైతులు బాధల గురించి ఆలోచించాలని కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది రైతులు ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వాటికి కారణాలు ఏంటో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు అంటే కేటీఆర్ రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు.