వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ సక్సెస్ రైడ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 3 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని క్రాస్ చేయడం సినిమాకి బిగ్ ఎచీవ్ మెంట్. ట్రైలర్ కి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. ఈ సినిమాలో కథే హీరో. కథని నమ్మే ఈ సినిమాతో ముందుకు వెళ్తున్నాను. ఇది సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2 ఎప్పుడనే ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది. స్క్రీన్ ప్లే నే ఈ సినిమాకి బలం. చాలా ఎంగేజింగ్ గా వుండే సినిమా ఇది. ఈ 25న అందరూ థియేటర్స్ లో చూసి సినిమాని పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను; అన్నారు
హీరోయిన్ అనన్య నాగేళ్ళ మాట్లాడుతూ.. నాకు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. కథ, నా క్యారెక్టర్ రెండూ నచ్చాయి. క్యారెక్టరైజెషన్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాతో మంచి విజయం వస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.
డైరెక్టర్ రైటర్ మోహన్ మాట్లాడుతూ..ఉత్తరాంద్ర నేపధ్యంలో జరిగే కథ ఇది. వెన్నెల కిషోర్ గారితో పాటు సినిమాలో నటించిన అందరూ ఆ యాసని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు. చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది. రాజీవ్‌గాంధీ హత్యకి గురైన రోజు జరిగే కథ ఇది. ఆయన విశాఖ పర్యటన ముగించుకుని శ్రీపెరంబుదూర్ వెళ్లారు. అక్కడ హత్యకి గురయ్యారు. అలాంటి ఓ పెద్ద సంఘటన జరిగినప్పుడు చిన్న సంఘటనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ రోజు జరిగిన కొన్ని కల్పిత సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఎమోషన్స్, థ్రిల్ అన్ని అద్భుతంగా వుంటాయి. రామ్ మోహన్ నాయిడు గారు ఇందులో శ్రీకాకుళం సాంగ్ ని విని చాలా అభినందించారు. వంశీ గారు చాలా మంచి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన రావడంతో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. చంటబ్బాయ్ తాలూకా అనే ట్యాగ్ వంశీ గారి అలోచనే. ఈ సినిమాలో ఓ మ్యాజిక్ జరిగింది. సినిమా అన్ ప్రిడిక్టబుల్ గా వుంటుంది’అన్నారు.
నిర్మాత రామణారెడ్డి మాట్లాడుతూ.. మోహన్ గారు చెప్పిన కథ చాలా నచ్చింది. కథని నమ్మి ఈ సినిమాని చేశాను. సినిమా తప్పకుండా ప్రేక్షకులని అలరిస్తుంది’ అన్నారు
యాక్టర్ అనీష్ కురివిల్లా మాట్లాడుతూ.. ఇది వరకు కొన్ని పోలీసు పాత్రలు చేశాను. కానీ ఇందులో ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ వుండే రోల్ చేశాను. ఈ క్రెడిట్ మోహన్ గారికి దక్కుతుంది. వెన్నెల కిషోర్ గారితో చాలా సీన్స్ ఉంటాయి. ఆయనతో కామెడీ చేయడం చాలా కొత్త ఎక్స్ పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశాను’ అన్నారు.
యాక్టర్ రవితేజ మాట్లాడుతూ.. ఇందులో ప్రతి క్యారెక్టర్ ని మోహన్ గారు చాలా ఆసక్తికరంగా డిజైన్ చేసుకున్నారు. నా పాత్ర కథలో కీలకంగా వుంటుంది. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం వుంది’అన్నారు.
యాక్టర్ నాగ మహేష్ మాట్లాడుతూ.. ఇందులో వెన్నెల కిషోర్ కి ఫాదర్ రోల్ చేశాను. త్రూ అవుట్ వుండే రోల్. ఇప్పటివరకూ నేను చేసి క్యారెక్టర్స్ భిన్నంగా వుంటుంది. ప్రేక్షకులు కొత్త కోణంలో చూస్తారు’ అన్నారు.