KTR: అల్లు అర్జున్ అరెస్ట్ కావటాన్ని కేటీఆర్ పూర్తిగా రాజకీయం చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడంతో పరోక్షంగా అల్లు అర్జున్ కారణమని పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేశారు. అయితే ఈయన అరెస్టు కావడంతో మొదట రియాక్ట్ అయినటువంటి వ్యక్తి కేటీఆర్. రాజకీయ కక్షల నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్టు చేశారు ఆయన ఒక స్టార్ హీరో అలాంటి వ్యక్తిని అరెస్టు చేయటం తప్పని ఈయన ఖండించడమే కాకుండా అల్లు అర్జున్ కు పూర్తిగా మద్దతు తెలిపారు.
ఇప్పటివరకు అంతా సవ్యంగానే ఉంది కానీ ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన అల్లు అర్జున్ అరెస్టు గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారని తద్వారా అల్లు అర్జున్ కి ఇబ్బంది కలుగుతుందని కేటీఆర్ వ్యాఖ్యలపై బన్నీ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బన్నీని అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకు హాజరు పరచడం ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. అయితే వెంటనే తన కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఇకపోతే ఏ క్షణం ఏం జరుగుతుందోనని అభిమానులు అల్లు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పుష్ప 2 సక్సెస్ మీట్ లో సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారనీ చెప్పే, అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించారని బిఆర్ఎస్ ఆరోపణ. కానీ కాంగ్రెస్ నేతలు , పోలీసులు మాత్రం అదేమీ లేదని మృతురాలి భర్త పిర్యాదు చేయడం వల్లే అరెస్ట్ చేసారని , అరెస్ట్ వ్యవహారం అనేది చట్టం పని అని , దానికి సీఎం రేవంత్ కు సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్న కేటీఆర్ మాత్రం పదే పదే అల్లు అర్జున్ అరెస్టును ప్రస్తావించడంతో ఈయన మాటల ద్వారానే అల్లు అర్జున్ ను మరోసారి ఇబ్బంది పెట్టబోతున్నారనీ అభిమానులు కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.