ఈ పాపతో కూడా పంచాయితీయేనా.?

ఆమె ఓ కర్లీ బ్యూటీ.! సినిమా ప్రమోషన్లకి అస్సలు సహకరించదంటూ అపవాదుని ఎదుర్కొంది. ఆమె మీద ఆ నింద వేసిందే, ఓ యంగ్ హీరో.! కనీ, సినిమా ప్రమోషన్లకు ఆమె చక్కగా సహకరిస్తుంటుంది.

నాలిక్కరచుకుని, క్షమాపణ కూడా చెప్పాడు ఆ యంగ్ హీరో, ఆ కర్లీ బ్యూటీకి.! నోటి దూలకి కేరాఫ్ అడ్రస్ ఆ యంగ్ హీరో.

అసలు విషయమేంటంటే, ఇప్పుడు ఇంకో హీరోయిన్ విషయంలోనూ నోటి దురద ప్రదర్శిస్తున్నాడట సదరు యంగ్ హీరో. తన తాజా సినిమా విషయమై సదరు యంగ్ హీరో, ఆ హీరోయిన్ గురించి అక్కడా ఇక్కడా నోరు జారేస్తున్నాడట.

విషయం ఆనోటా, ఈనోటా ఆ హీరోయిన్ చెవిన పడేసరికి, ఆమె గుస్సా అయ్యిందట. ఆ సంగతి హీరోగారికి కూడా అర్థమయ్యి, ఆమెను దువ్వే ప్రయత్నం చేస్తున్నాడట. నోటి దూలకి మందు లేదు మరి.! అదో రోగం.!