Anil Ravipudi: ఈరోజుల్లో సినిమా చేయడం ఎంత కష్టమో ఆ సినిమాను ప్రమోట్ చేయడం అన్నది అంతకంటే ఎక్కువ కష్టం అని చెప్పాలి. సినిమాను ప్రమోట్ చేసుకోవడం అన్నది ఈ మధ్యకాలంలో పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి ఈ మూవీ మేకర్స్ నాన్న తంటాలు పడుతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి చాలా తెలివిగా ఆలోచించారు. నిర్మాతకు ఖర్చులు తగ్గిస్తూనే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్నారు. అనిల్ రావిపూడి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాఫై భారీగా అంచనాలను పెంచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రమణ గూగుల్ పాడిన పాట మాత్రం యూట్యూబ్లో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా ఈ పాడు తప్ప మరొక పాట వినిపించడం లేదు. ఈ ఒక్క పాటతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇది చాలదన్నట్లు అనిల్ రావిపూడి తన చిలిపి ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. సినిమా షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి వెంకటేష్ మధ్య జరిగిన కొన్ని ఫన్నీ రీల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొత్త తరహాలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. నిర్మాతలు రూపాయి ఖర్చు కాకుండా సెట్ నుంచే ప్రమోషన్ కానిచ్చేస్తున్నారు అనిల్ రావిపూడి. ముఖ్యంగా ఇందులో అనిల్ రావిపూడి ఒక పాట పాడాలి అనడంతో నేను పడతాను అంటూ వెంకీ మామ వెంట పడడం, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి బాలయ్య బాబు అభిమానులు అనగానే పరిగెత్తడం ఇలాంటి వీడియోలు బాగా నవ్వులు తెప్పిస్తున్నాయి.