Ramanaidu: విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూమి వివాదాస్పదంగా మారింది. ఏపీలో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధిపరిచే విధంగా ప్రభుత్వం రామానాయుడు స్టూడియోకి 34. 44 ఎకరాల భూమిని స్టూడియో నిర్మాణం కోసం కేటాయించారు. ఈ స్థలం భీమిలి బీచ్ పక్కన ఉంది. ఇలా అప్పటి ప్రభుత్వం స్టూడియో నిర్మాణం కోసం పెద్ద ఎత్తున భూమిని కేటాయించినప్పటికీ 34 ఎకరాలలో స్టూడియో నిర్మాణం మాత్రం చేపట్టలేదు.
ఇప్పటికీ ఇక్కడ 15.77 ఎకరాల భూమి ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ మిగిలిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మొత్తంలో స్టూడియో నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాని ఈ 15 ఎకరాలలో ఉన్న ఖాళీ స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి దానిని సొమ్ము చేసుకుంటున్న నేపథ్యంలో కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది వైసిపి నేతలు ఈ 15 ఎకరాలను ఫ్లాట్లుగా మార్చి లేఔట్ ల కూడా వేశారు. ఇలా ఈ భూమిని ఫ్లాట్ లుగా మార్చడం కోసం అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు అయితే వైసిపి నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కూటమి సర్కార్ ఈ విషయంలో పునరాలచన చేసి ఖాళీగా ఉన్న స్థలాన్ని తిరిగి ప్రభుత్వమే వెనక్కి తీసుకునేలా నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే 15.17 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.