నిర్మాతగా మారనున్న జూనియర్ ఎన్టీయార్.?

యంగ్ టైగర్ ఎన్టీయార్ నిర్మాతగా మారబోతున్నాడా.? హీరోల్లో చాలామందికి సొంత బ్యానర్లు వున్నాయ్. ఆయా బ్యానర్ల మీద కొందరు చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కొత్త బ్యానర్లు స్టార్ట్ చేస్తున్న, చేసిన హీరోల లిస్టులో జూనియర్ ఎన్టీయార్ కూడా చేరబోతున్నాడట.

వాస్తవానికి, ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ అంటే జూనియర్ ఎన్టీయార్‌కి సొంత బ్యానర్ కిందనే లెక్క. అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌దే ఆ బ్యానర్ కాబట్టి, తమ్ముడు జూనియర్ ఎన్టీయార్‌కి కొత్త బ్యానర్ అవసరం లేదు.

కానీ, జూనియర్ ఎన్టీయార్ ఒకట్రెండు చిన్న సినిమాల్ని ప్రమోట్ చేసేందుకోసం కొత్తగా ఓ బ్యానర్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తండ్రి పేరు మీద ఆ బ్యానర్ స్టార్ట్ చేస్తాడన్న కోణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్‌బాబు, రవితేజ లాంటి హీరోలు ఇప్పటికే తమ తమ బ్యానర్ల ద్వారా చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా గతంలో నితిన్ సినిమాని ప్రమోట్ చేశారు.

జూనియర్ ఎన్టీయార్‌కి అత్యంత సన్నిహితుడైన ఓ యంగ్ హీరో సినిమా, జూనియర్ ఎన్టీయార్ కొత్త బ్యానర్ ద్వారా ప్రమోట్ కాబోతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు, జాన్వీ కపూర్ హీరోయిన్.