చిన్నా చితకా సినిమాల్ని స్వీయ నిర్మాణంలో చేసేస్తుంటాడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు నాట చెప్పుకోదగ్గ స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ, ఇంతవరకు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసింది లేదు.
కానీ, తీసే ప్రతి సినిమానీ తెలుగులోకి రిలీజ్ చేస్తుంటాడు. ఈ మధ్యనే ‘లవ్ గురు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. బాగా పబ్లిసిటీ చేసుకున్నాడు. సినిమా ఫర్లేదు.. అనే టాక్ అయితే రాబట్టుకున్నాడు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విజయ్ ఆంటోనీ ఓ బై లింగ్వల్ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఓ టాలీవుడ్ హీరోతో ఈ మేరకు చర్చలు జరిపేందుకు సమాయత్తమవుతున్నాడట.
స్ట్రెయిట్ తెలుగు సినిమా.. అనే ఫీల్ వచ్చేలా ఈ బై లింగ్వల్ ఫిలింని విజయ్ ఆంటోనీ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఓ మోస్తరు స్టార్‌డమ్ వున్న హీరోతోనే డీల్ సెట్ చేసుకోవడానికి విజయ్ ఆంటోనీ రెడీ అవుతున్నాడట.
కథ రెడీగా వుందనీ, దర్శకత్వం విషయంలో టాలీవుడ్ హీరో సూచనల్ని కూడా తీసుకుని, దర్శకుడ్ని ఎంపిక చేస్తారనీ తెలుస్తోంది. అయినా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడాల్లేవ్.. అంతా ఇండియన్ సినిమానే.!
లిమిటెడ్ బడ్జెట్‌లో సినిమాలు చేసి, హిట్టు.. యావరేజ్.. అనే టాక్ రాబట్టుకోగలిగే స్తామినా వున్న విజయ్ ఆంటోనీ చేయబోయే బిగ్ రిస్క్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.