Mithun Reddy: వైకాపా ఎంపీ మిధున్ రెడ్డికి భారీ ఊరట లభించింది.. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈయన తనకు ముందస్తు బెయిల్ కావాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు మాత్రం ఈయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది. ఇలా హైకోర్టులో తనకు సానుకూలంగా తీర్పు రాకపోవడంతో మిధున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక సుప్రీంకోర్టు మాత్రం ఈయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మిథున్ రెడ్డి తరపున వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. అలాగే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకూ మిథన్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి.ఇప్పటికే ఈ కేసులో పలువురి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి సమాచారం మేరకు ఎంపీ మిథున్ రెడ్డి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఈ పిటిషన్ కొట్టి వేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే తనను అరెస్టు చేయకూడదంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారి చేసింది. మరో వైపు సిఐడీ అధికారులు మాత్రం మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని తనని లిక్కర్ స్కామ్ లో పూర్తిస్థాయిలో విచారణ చేయాలి అంటూ కోర్టును కోరుతున్నారు. ఏది ఏమైనా కోర్టు నుంచి ఈయనని అరెస్టు చేయకూడదు అంటూ ఉత్తర్వులు రావడంతో మిధున్ రెడ్డికి భారీగా ఊరట లభించిందని చెప్పాలి.