KCR: కెసిఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన రేవంత్… గులాబీ బాస్ ఫామ్ హౌస్ కి పరిమితం కావలసిందేనా?

KCR: గులాబీ బాస్ కెసిఆర్ రాజకీయాల పరంగా తిరిగి బిజీ అవుతున్నారు. ఎన్నికలు ఓడిపోయినప్పటి నుంచి కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితం అయ్యారు. అయితే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు.

ఈయన తిరిగి రాజకీయ కార్యకలాపాలలో బిజీ అవుతున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభలకు సంబంధించి నేతలతో ఇప్పటికే కేసీఆర్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కెసిఆర్ ఎత్తుగడకు రేవంత్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బి ఆర్ ఎస్ పార్టీ ఉంది. అయితే ఆ సభలకు అడుగున అడ్డంకి వేసేలా రేవంత్ ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది.ఏప్రిల్ 27వ తేదీ నుంచి… రేవంత్ రెడ్డి సర్కార్ పై నేరుగా పోరాటం చేయబోతున్నారు కేసీఆర్.ఈ బహిరంగ సభ నుంచే కేసీఆర్ వార్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభకు వరంగల్ పోలీసులు అడ్డంకులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీ నిర్వహించబోతున్న రజతోత్సవ సభ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చారట.

ఈ యాక్ట్ అమలలోకి తీసుకు వస్తే ఈ బహిరంగ సభ దాదాపు రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సభ నిర్వహించకుండా సిటీ పోలీస్ యాక్ట్ ను వరంగల్ జిల్లాలో.. కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పోలీసుల ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి మరో 30 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ అడ్డంకులను తట్టుకొని కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తారా లేదంటే రద్దు చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.