Nagababu: కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి వారిపై కేసులు నమోదు అవ్వడం వారిని జైలుకు పంపించడం అనేది జరుగుతుంది. అయితే ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు షాక్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల తన అన్నయ్య ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.
నాగబాబు రెండు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఇక పిఠాపురంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా హాజరవుతారు కానీ నాగబాబు పర్యటనలో వర్మకు పిలుపు రాలేదు.
ఇకపోతే ఈ పర్యటనలో భాగంగా నాగబాబుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. ఆయన పర్యటనకు ఆటంకాలు కలిగించడంతో నాగబాబు తన ఎమ్మెల్సీ పదవీ పవర్ చూపించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన కార్యక్రమంలో పలు చర్యలకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఈయన కేసు పెట్టినట్టు సమాచారం దీంతో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై కేసులో నమోదయాయని తెలుస్తోంది.
నాగబాబు వర్మను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడంతోనే వర్మ అనుచరులు నాగబాబు పర్యటనను అడ్డుకున్నారని తెలుస్తుంది. నాగబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని జై వర్మ అంటూ నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వర్మకు తగిన ప్రాధాన్యత లేకపోవడంతోనే వర్మ అనుచరులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. తెలుగు తమ్ముళ్లపై కేసుల నమోదు అయ్యాయనీ తెలుస్తుంది.