Revanth Reddy: రేవంత్ రెడ్డి దెబ్బకు దడుచుకున్న తెలుగు హీరోలు… అందుకే మౌనంగా ఉన్నారా?

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ హీరోలు భయపడ్డారా అంటే అవుననే తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు ఎలా ఉంటాయో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్టుతో శాంపుల్ చూపించారు. దీంతో తెలంగాణకు సంబంధించిన ఏ విషయం గురించి మాట్లాడకూడదని నిర్ణయాన్ని హీరోలు తీసుకున్నారని స్పష్టమవుతుంది.

పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన లో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా అల్లు అర్జున్ అరెస్టును తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు అంతేకాకుండా మరణించిన వారిని కాకుండా హీరో అల్లుఅర్జున్ ని పరామర్శించడం కోసం ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లడం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలు సినిమా టికెట్లు రేట్లు పెంచనని ఆయన హీరోలకు ఊహించని షాక్ ఇచ్చారు. దేబ్బకు హీరోలు అందరూ కూడా సైలెంట్ అయ్యారని చెప్పాలి అయితే ఇప్పుడు తెలంగాణ సర్కార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏకంగా 4 ఎకరాల అటవీ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు ఇలా చదును చేయడం తప్పు అంటూ ఎంతో మంది హీరోయిన్లు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు చేస్తున్నారు.

ఇలా రేవంత్ నిర్ణయం సరైంది కాదు అంటూ హీరోయిన్లు వరుసగా పోస్టులు చేస్తున్నప్పటికీ ఒక్క హీరో కూడా ఇప్పటివరకు ఈ యూనివర్సిటీ వివాదం గురించి స్పందించలేదు. ఇలా రేవంత్ నిర్ణయాన్ని హీరోలు వ్యతిరేకించకపోవడానికి కారణం తమ సినిమాలు ఇబ్బందులలో పడతాయన్న ఉద్దేశంతోనే మౌనం పాటిస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి అంటే ఎక్కడో ఏదో మూలన ఆయనతో మనకెందుకులే అనే భావన ఉందని తెలుస్తుంది.