Star Heros: స్టార్ హీరోలు ఫుల్ బిజీ.. దర్శకులే కాదు, అభిమానులు కూడా వెయిటింగ్!

టాలీవుడ్ స్టార్ హీరోల షెడ్యూళ్లు ప్రస్తుతం ఫుల్ బుక్డ్‌గా మారిపోయాయి. గతంలో ఏడాదిలో రెండు సినిమాలు చేయడం కామన్‌గా కనిపించేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద సినిమాలు చేయడం, బడ్జెట్, విజువల్స్, మార్కెట్ లెక్కలు పెరిగిపోవడంతో ఒక్కో ప్రాజెక్ట్‌కు ఏళ్ల తరబడి టైం పడుతోంది. ఫలితంగా ఇతర నిర్మాతలు, వేరే దర్శకులు ఈ స్టార్ హీరోల డేట్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభాస్ లైన్‌అప్ చూస్తే.. ‘ది రాజా సాబ్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘ప్రశాంత్ వర్మ సినిమా’ ఇలా ఒక్కో సినిమా బడ్జెట్ రూ.300 కోట్లపైమాటే. దీంతో ఆయన డేట్స్ 2027 వరకు ఖచ్చితంగా ఫుల్ బిజీ. ఎన్టీఆర్ కూడా తక్కువేమీ కాదు. ‘వార్ 2’, ‘డ్రాగన్’, ‘దేవర 2’, ‘నెల్సన్ సినిమా’ అంటూ వరుసగా పెద్ద ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ కనీసం రెండు సంవత్సరాలు పట్టే సినిమాలే కావడం విశేషం.

ఇక రామ్ చరణ్ కూడా బుచ్చిబాబుతో ‘పెద్ధి’, తర్వాత సుకుమార్‌తో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు సినిమాలు OG, హరిహర వీర మల్లు, భగత్ సింగ్ షూటింగ్ మధ్యలోనే ఉన్నాయి. మరోవైపు రాజకీయాలతో కూడిన పరిస్థితి వల్ల కొత్త సినిమాలకు అవకాశం రావడం కష్టమే అంటున్నారు. అల్లు అర్జున్ అట్లీ, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో కమిట్ అవ్వడంతో 2026 వరకూ బిజీగా ఉన్నాడు.

ఇక మహేష్ బాబు అయితే SSMB29 అనే పేరుతో రాజమౌళి దర్శకత్వంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇది కేవలం సినిమా కాదు, ఒక గ్లోబల్ ఎక్స్‌పెరియెన్స్ అంటున్నారు. అందుకే స్క్రిప్ట్ నుంచి షూటింగ్ దాకా అన్నీ సంవత్సరాలుగా సాగుతాయని సమాచారం. మొత్తానికి స్టార్ హీరోల డేట్స్ సంపాదించాలంటే 2027 తరువాతే. కానీ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ప్రతీ ఏడాది ఏదో ఒక స్టార్ హీరో సినిమా వచ్చి థియేటర్‌లలో పండగలా మారబోతోంది.

నిత్యానంద మాయ కిలాడీ రంజిత || Director Geetha Krishna About Nityananda & Ranjitha || Telugu Rajyam