ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియలో 89 ఉద్యోగ ఖాళీలు.. ఒకింత భారీ వేతనంతో?

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ దరఖాస్తులను కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 89 ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

2024 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 31,000 రూపాయల నుంచి 92,000 రూపాయల వరకు వేతనం లభించనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కు ఫీజులో మినహాయింపులు ఉండనున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2025 సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.