Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అడవుల బాట పట్టారు. ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన శాఖలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చాలా చక్కగా పర్యవేక్షిస్తూ ఆ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే గిరిజన ప్రాంతాలపై పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తుంది. నేడు ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికి కొన్ని గిరిజన ప్రాంతాలలో ప్రజలలో సరైన వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాలకు గర్భిణీ స్త్రీలను డోలీలపై తీసుకు వెళుతున్నటువంటి ఘటన ఇప్పటికీ పలు ప్రాంతాలలో చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం కోసం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇదివరకే మన్యం జిల్లాలలోని గిరిజన ప్రాంతాలలో పర్యటన చేసిన ఈయన గిరిజన ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గాలు లేకపోవడంతో రోడ్లు వేయించిన విషయం తెలిసిందే.
ఇకపోతే నేడు రేపు కూడా గిరిజన ప్రాంతాలలో పర్యటించబోతున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. విశాఖపట్నం నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో రోడ్డు మార్గంలో అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం చాపరాయికి ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. ఇక అక్కడి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెదపాడు గ్రామాన్ని సందర్శించి, అక్కడ గిరిజన ప్రజల ఆవాసాలను సందర్శిస్తారు. అక్కడ అడవి తల్లి బాట పేరుతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు . ఇలా రెండు రోజులపాటు అడవుల తల్లి బాట అంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.