Sunrisers Hyderabad: సన్ రైజర్స్.. అతనితో రిస్క్ చేసి తప్పు చేశారు!

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి గేమ్ అనంతరం నాలుగు సార్లు బోర్లా ఊహించని అపజయాలు మూటగట్టుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో ఉప్పల్‌లో జరిగిన హోం మ్యాచ్‌లోనూ బ్యాట్స్ మెన్ లు మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం ఎవరు? అనే ప్రశ్నకు ఒక్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అతనే సిమర్‌జీత్ సింగ్. కేవలం ఒక ఓవర్‌తో మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా చెడగొట్టాడని అభిమానులు పెదవి విరిచేస్తున్నారు.

మ్యాచ్ ఆరంభంలో షమీ, కమిన్స్ అద్భుత బౌలింగ్‌తో గుజరాత్‌ను 28-2తో కట్టడి చేశారు. శుభ్‌మన్ గిల్ ఒక దశలో ఒత్తిడిలో కనిపించగా, వాషింగ్టన్ సుందర్ డిఫెన్సివ్‌గా ఆడుతున్నాడు. కానీ సిమర్‌జీత్ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో రెండేసి ఫోర్లు, సిక్సర్లతో 20 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను గుజరాత్ వైపు తిప్పేశాడు. దీంతో గిల్ ధైర్యం పెంచుకొని హాఫ్ సెంచరీ చేయడంతో పాటు మ్యాచ్ ఫినిష్ చేసేంత వరకు నిలిచాడు.

ఈ ఒక్క ఓవర్‌కి ముందు గేమ్ బలాన్నే మార్చిన సిమర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. “ఓకే ఓవర్‌తో నాశనం చేశావు”, “ఈవెన్ గేమ్‌ను వదిలేసావు” అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అంతేకాదు, SRH మేనేజ్‌మెంట్ అతనిపై ఎందుకు నమ్మకం పెట్టిందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అతని ప్రెజర్ హ్యాండ్లింగ్‌పై నిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక సిమర్‌జీత్ విషయానికి వస్తే, 1998లో ఢిల్లీలో పుట్టిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 10 మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన అతడిని SRH రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. మొదటి మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చాడు. గుజరాత్ మ్యాచ్‌లో 1 ఓవర్ వేసి 20 పరుగులు ఇవ్వడం అతని ప్రదర్శనపై పెద్ద ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. మరి మ్యాచ్ ఒత్తిడిని తట్టుకునే మానసిక స్థైర్యంతో సిమర్‌జీత్ తిరిగి రాబోతాడా? లేక SRH అతన్ని మరింత దూరం పెడుతుందా అన్నది కాలమే సమాధానం ఇవ్వాలి.

ఏపీలో ఏరులై పారుతున్న మద్యం || Huge Liquor Shops in AP || AP Liquor Policy || Chandrababu || TR