లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మరియు ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో వైరల్ గా మారిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) తో అంత హోరెత్తుతోంది. ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ అయినటివంటి గోల్డెన్ గ్లోబ్స్ 2023 లో సత్తా చాటి మొదటి అవార్డు గా సినిమాలో బెస్ట్ సాంగ్ నాటు నాటు కి గాను అవార్డు లభించింది.
దీనితో ఈ చిత్రం సెన్సేషన్ ని రేపగా ప్రస్తుతం చిత్రం యూనిట్ సహా ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అవార్డ్స్ లో RRR రెండు కేటగిరీ లలో ఎంపిక అయ్యింది. మొదటగా బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమా కాగా మరొకటి సాంగ్ కి గాను అయ్యింది. అయితే వీటిలో సాంగ్ కి అవార్డు అందుకోగా బెస్ట్ సినిమా జాబితాలో మాత్రం RRR మిస్ అయ్యింది.
మరి బెస్ట్ సినిమాగా అయితే “అర్జెంటీనా 1985” అనే స్పానిష్ చిత్రం అయితే బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమా గోల్డెన్ గ్లోబ్స్ లో అవార్డు గెలుచుకుంది. దీనితో ఇలా అయితే RRR మిస్ అయ్యింది. కానీ సాంగ్ పరంగా మాత్రం ఇప్పుడు ఇండియన్ సినిమా లవర్స్ లో సంబరాలు అంబరాన్ని అంటుంతూ ఉండగా మెగాస్టార్ చిరంజీవి సహా ఎందరో స్టార్స్ చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు.