Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పటికే మొదటి రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమా ఏకంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 3 కూడా ఉండబోతుందని స్పష్టంగా వెల్లడించారు. పుష్పరాజుకు ఇంటిపేరు రావడమే కాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈయన సంతోషంగా గడపడంతో ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి రిమోట్ నొక్కి పుష్పరాజ్ కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తారు.
ఆ రిమోట్ వ్యక్తి ఎవరు? ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ చనిపోలేదా? లేదంటే మరో కొత్త వ్యక్తి విలన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అంటూ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 3 గురించి పుష్ప 2కి సంబంధించి గతంలో రిలీజైన ఓ టీజర్‌లోనే కథ చెప్పేశాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్యామిలి మొత్తాన్ని కోల్పోయిన పుష్ప రాజును జగపతిబాబు మనుషులు వెంటాడటంతో ఆయన అడవిలోకి వెళ్తారు.
ఇలా పుష్పరాజ్ కనిపించలేదని గ్రామస్తులు అందరూ కూడా వెతుకుతున్న నేపథ్యంలో అడవిలో ఏర్పాటు చేసిన ఒక సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో అల్లు అర్జున్ కనిపిస్తారు. అలా ఆయన కూలిగా మారి ఇంటర్నేషనల్ లెవెల్ లో తన హవా చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాసిల్ నటించారని ఆయన ఈ సినిమాలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. ఇక ఆయన నటించకపోతే మరో కొత్త విలన్ ఎవరు నటిస్తారు అంటూ చర్చలు జరుగుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.