Pushpa 2: అత్యధిక వసూళ్ళు అందుకున్న టాప్ మూవీస్.. పుష్ప 2 స్తానం ఎంతంటే..

అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2: ది రూల్” సినిమా భారతీయ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించింది. దర్శకుడు సుకుమార్ క్రియేటివిటీ, బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రాన్ని సరికొత్త హైట్స్‌కి తీసుకెళ్లాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సాధించిన విజయాలు కేవలం టాలీవుడ్‌కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులకు గర్వకారణంగా నిలిచాయి.

22 రోజుల్లోనే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1700 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, అత్యధిక వసూళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న “దంగల్” రూ. 2000 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, “బాహుబలి 2” రూ. 1810 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, పుష్ప 2 త్వ‌రలోనే బాహుబలి 2 రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

హిందీ బెల్ట్‌లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. మొదటి వారంలోనే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం రూ. 700 కోట్లకు పైగా హిందీ మార్కెట్‌లో వసూలు చేసింది. నైజాం, సీడెడ్, ఆంధ్రా ప్రాంతాల్లో కూడా పుష్ప 2 సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. అంతేకాకుండా, యుఎస్, యుకె, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ చిత్రం దూసుకుపోతోంది.

అంతర్జాతీయ స్థాయిలోనూ పుష్ప 2 భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. డీవీడీ, ఓటిటి హక్కుల పరంగా కూడా పుష్ప 2 భారీ డీల్స్‌ను సొంతం చేసుకుంది. టాప్ 5 జాబితాలో వేగంగా చోటు సంపాదించిన పుష్ప 2, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. మొత్తానికి, ఈ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు. పుష్ప రాజ్ ప్రభంజనం ఇంకా ఎంత దూరం వెళ్లబోతుందో చూడాలి.

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు:

దంగల్ – 2000+ Cr

బాహుబలి2 – 1810+ Cr

పుష్ప2- 1700Cr+** (22 రోజులు)

RRR – 1270Cr

KGF ఛాప్టర్ 2 – 1200Cr