RRR Documentary: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లు కలిసిన నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోట్లల్లో కలెక్షన్స్ ను సాధించింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో విడుదల అయ్యి అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ చాలా కష్టపడిన విషయం తెలిసిందే. వారు పడిన కష్టాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసుకువచ్చారు దర్శకుడు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ ని విడుదల చేశారు రాజమౌళి. ఇటీవలే డిసెంబర్ 20వ తేదీన ఈ డాక్యుమెంటరీ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 27న ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లోకి కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే ఈ డాక్యుమెంటరీని దాదాపు 200 రూపాయల టికెట్ పెట్టి థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. దాదాపుగా 1 గంట 40 నిముషాలు నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని థియేటర్ కి వెళ్లి చూడటానికి ఎవరూ సుముఖం చూపించలేదు. ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ వాళ్ళ రీ రిలీజ్ సినిమాలకే థియేటర్స్ కి వెళ్లి రచ్చ చేస్తారు అలాంటిది ఆర్ఆర్ఆర్ మేకింగ్ కి చెందిన డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే కనీసం థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
పైగా ఓటీటీ లో రిలీజ్ చేయాల్సిన కంటెంట్ ని థియేటర్లో ఎందుకు రిలీజ్ చేశారు అని విమర్శలు కూడా వచ్చాయి. ఇదంతా ఒక ఎత్తైతే గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా హవా, అల్లు అర్జున్ వివాదంతో మీడియా, జనాలు కూడా ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీని పట్టించుకోలేదు. మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ చేయలేదు. అసలు చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ డాక్యుమెంటరీని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. దీంతో ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ థియేట్రికల్ రిలీజ్ అనేది డిజాస్టర్ లా మిగిలింది. ఆస్కార్ తెచ్చిన సినిమా డాక్యుమెంటరీని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. అసలు ఈ డాక్యుమెంటరీ విడుదల అయిన విషయం కూడా చాలామందికి తెలిసిందే. అసలు ఈ డాక్యుమెంటరీని చెర్రీ, తారక్ అభిమానులు కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం. అందరి హీరోలా అభిమానులు ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు వ్యవహారం పైన దృష్టి పెట్టారు. దీంతో ఈ డాక్యుమెంటరీ ని పట్టించుకునే నాధుడే కరువయ్యారు.