గుండెపోటుతో నటుడు రుతురాజ్‌సింగ్‌ మృతి!

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. టెలివిజన్‌ నటుడు రుతురాజ్‌ సింగ్‌ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన వయసు 59. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన రుతురాజ్‌ కోలుకుని ఇంటికి వచ్చాడని, అయితే ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు.