Shambala : ‘శంబాల’ని థియేటర్‌లో చూస్తేనే సౌండింగ్‌ను ఎంజాయ్ చేస్తారు – సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల

Shambala : వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల చిత్ర విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివే..

* ‘శంబాల’లో చాలా థీమ్స్ ఉంటాయి. దర్శకుడు కథ చెప్పిన నెక్ట్స్ డే నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. డైరెక్టర్ యుగంధర్‌కి సౌండింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. ఆయన డైరెక్షన్ టీం కూడా ఎంతో ప్యాషనేట్‌గా ఉంటుంది. ప్రతీ విషయంలో వారు ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటుంది. నేను ఎన్నో థ్రిల్లర్‌కు పని చేశాను. కానీ ‘శంబాల’ లాంటి సైంటిఫిక్, మైథలాజికల్ థ్రిల్లర్‌కు పని చేయడం కొత్తగా అనిపించింది.

* ప్రతీ ఒక్కరి దగ్గర అన్ని రకాల ఇన్‌స్ట్రూమెంట్స్ ఉంటాయి. నేను మాత్రం కొత్తగా, వెరైటీగా సౌండ్‌ను క్రియేట్ చేయాలని చూస్తుంటాను. ఇలాంటి చిత్రాలకు సీట్ ఎడ్జ్‌లో కూర్చో పెట్టాలంటే సౌండ్ మరింత గొప్పగా ఉండాలి. సౌండ్‌తో ఆడియెన్స్‌ని ఎక్కువగా మిస్ లీడ్ చేయాల్సి ఉంటుంది. కథలో భాగంగా వచ్చే నాలుగు పాటలు అద్భుతంగా ఉంటాయి.

* నేను చిన్నప్పటి నుంచి మన మైథలాజికల్ స్టోరీస్ వింటూనే పెరిగాను. ఇప్పుడు ఆ జానర్‌లో వచ్చిన కథకు మ్యూజిక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ మూవీ కోసం నేను రకరకాల ఇన్ స్ట్రూమెంట్స్‌ను వాడాను. నేను నా సొంత పని కోసం కొన్ని ఓ పరికరాన్ని కూడా ఈ మూవీ కోసం వాడాను.

* నిర్మాతలు ఎక్కడా కూడా ఎవ్వరినీ కంగారు పెట్టలేదు. కావాల్సినంత టైం ఇచ్చారు. మంచి అవుట్ పుట్ కోసం వారు కూడా చాలా ఖర్చు పెట్టారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ‘శంబాల’ని నిర్మించారు.

* ‘శంబాల’ పాటలు, ఆర్ఆర్ ఇలా అన్నీ కూడా ఒకే టేక్‌లో పూర్తయ్యాయి. పాటలు చాలా బాగా వచ్చాయి. టీం మాత్రం పాటల్ని స్లోగా రిలీజ్ చేస్తున్నారు. నా టీం వల్లే నేను ఇచ్చే సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. నా ప్రతీ సినిమాలోని ఆర్ఆర్‌కి మంచి పేరు వచ్చింది.

* ఆది గారి ప్రతీ సినిమాలో ఓ చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ‘శంబాల’ మూవీలో కూడా అలాంటి ఓ మెలోడీ సాంగ్ ఉంది. అది త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఎండ్ టైటిల్‌లో వచ్చే పాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదికి ఇది చాలా కొత్త, వెరైటీ చిత్రమని చెప్పుకోవచ్చు. మంచి టీంతో కలిసి చేసి మంచి సినిమాను చేశాం.

* సౌండ్ డిజైనింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. థియేటర్‌లో ఈ మూవీని చూస్తేనే మంచి ఫీల్ వస్తుంది. ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో సౌండ్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ మూవీని థియేటర్‌లో చూస్తేనే సౌండింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. నా వాయిస్‌తోనే రకరకాల సౌండ్స్‌ను ఇచ్చాను. అవన్నీ కూడా డైరెక్టర్‌కు బాగా నచ్చాయి.

* ‘శంబాల’ అందరినీ మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేలా ఉంటుంది. ఇది నా కెరీర్‌లో 49వ చిత్రం. ‘అనుమానపు పక్షి’ నా 50వ చిత్రం. ఈ రెండు చిత్రాలు నాకెంతో ప్రత్యేకం. నేను ప్రతీ సినిమాకు ఒకేలా కష్టపడతాను. నిద్రపోకుండా పని చేస్తాను. ఎంతైనా టైం తీసుకుంటాను గానీ కాపీ మాత్రం కొట్టను. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా కూడా అందులో నా స్టైల్‌ ఉండేలా చూసుకుంటాను.

జగన్ బాంబు || Analist Chinta Rajasekhar EXPOSED Ys Jagan Koti Santakhala Rally || Vijayawada || TR