శరీరంలో ఆ ప్రదేశంలో పుట్టుమచ్చ ఉంటే జాగ్రత్త.. వీరికి గుండెపోటు వచ్చే రిస్క్ ఎక్కువంట..!

జ్యోతిష్యం, వాస్తు, సాముద్రికం లాంటి శాస్త్రాలపై ఆసక్తి.. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కూడా మళ్లీ మళ్లీ నిరూపితమవుతోంది. ముఖ్యంగా చేతిపై కనిపించే చిన్న పుట్టుమచ్చలు మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని సూచిస్తాయని సాముద్రిక శాస్త్రం చెప్పే విశేషాలు ఇటీవలి కాలంలో మళ్లీ వైరల్ అయిపోతున్నాయి. చేతిలోని రేఖలు మన భావాలు, మన decisions, ఆరోగ్యం, సంబంధాలు.. అన్నింటినీ ప్రతిబింబిస్తాయని నమ్మకం. అందులో హృదయ రేఖకు ఉండే ప్రాధాన్యం మరింత ఎక్కువ.

హృదయ రేఖపై పుట్టే చిన్న నల్లటి మచ్చ, ముదురు బొట్టు లేదా పుట్టుమచ్చ సాధారణ విషయం కాదు అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. ఈ మచ్చలు వ్యక్తి గుండె ఆరోగ్యం, భావోద్వేగ జీవితం, రక్తప్రసరణ, భవిష్యత్‌లో వచ్చే ఆరోగ్య సమస్యలను సూచించే సంకేతాలుగా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ మచ్చలు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నవారిలో కనిపించవచ్చని పురాతన గ్రంథాలు కూడా చెబుతున్నాయి.

హస్తసాముద్రికం ప్రకారం, హృదయ రేఖపై నల్లటి మచ్చ ఉన్నవారు భావోద్వేగాలకు సున్నితులు, ఒత్తిడిని ఎక్కువగా అనుభవించే వ్యక్తులు కావచ్చని చెబుతారు. భావోద్వేగ ఒత్తిడి దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి, ఇది ఒక అలర్ట్ సిగ్నల్ లాంటి సూచనగా భావిస్తారు. ఇక గుండెకు హానికరమైన అలవాట్లు.. మసాలా పదార్థాలు, వేయించిన ఆహారం, జంక్ ఫుడ్, ధూమపానం, మద్యం, వాటిని తగ్గించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిపుణులు కూడా సలహా ఇస్తారు. సాముద్రిక శాస్త్రం చెప్పే ఈ తరహా సూచనలు ఆరోగ్య జాగ్రత్తలతో మేళవిస్తే మరింత ప్రయోజనకరమని పామిస్టులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మచ్చ ఉన్న ప్రదేశం కూడా ఎంతో ముఖ్యమని సాముద్రిక నిపుణులు చెబుతారు. హృదయ రేఖ ప్రారంభంలో ఉంటే చిన్న వయసులోనే భావోద్వేగ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తారు. మధ్యలో ఉంటే మధ్య వయస్సులో ఆరోగ్య సమస్యలు రావచ్చని, చివర భాగంలో ఉంటే వృద్ధాప్యం దగ్గరపడ్డాక ఏర్పడే హృదయ సంబంధ సమస్యలను సూచించవచ్చని నమ్మకం. అయితే ఇది అన్ని సందర్భాల్లో నిజమని చెప్పడం కష్టం.. అనుభవజ్ఞుడైన హస్తసాముద్రికుడు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలడని చెబుతారు.

అందువల్ల, చేతిపై హృదయ రేఖ దగ్గర కనిపించే చిన్నపాటి పుట్టుమచ్చను చూసి భయపడాల్సిన పనిలేదు. ఇది భవిష్యత్‌ని భయపెట్టే సూచన కాదు.. ఆత్మపరిశీలన చేయమని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టమని ఇచ్చే చిన్న హెచ్చరిక మాత్రమే. సరైన ఆహారం, నడక, యోగా, ధ్యానం వంటి మార్పులు మన హృదయాన్ని దృఢంగా ఉంచగలవు. సాముద్రికం చెప్పే సూచనలు శాస్త్రీయ నిర్ధారణలు కాకపోయినా, మన జీవనశైలిని మెరుగుపరచడానికి గుర్తు చేసే చిన్న అలారం లాంటిది. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)