OH Movie Review: ‘ఓహ్’ మూవీ రివ్యూ & రేటింగ్

OH Movie Review: పురాతన శాస్త్రాలకు, ఆధునిక ప్రేమకు మధ్య ఒక అద్భుత ప్రయాణం.. ‘ఓహ్’ (OH) మూవీ. ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో, రఘు రామ్ – శృతిశెట్టి,నైనా పాఠక్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘ఓహ్’ (OH) చిత్రం ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, భారతీయ పురాణాలు ప్రాచీన విజ్ఞానాన్ని జోడించి తీసిన ఈ చిత్రం ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది.

కథా నేపథ్యం:

కథానాయకుడు కృష్ణ (రఘురామ్), కావ్య(శృతి శెట్టి) అనే అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. అయితే, అతనికి ఉన్న ‘క్రోమోఫోబియా’ (Chromophobia) అనే వింత సమస్య కారణంగా దృశ్య( నైనా పాఠక్ ) అనే మరో అమ్మాయితో ఉన్న బంధాన్ని గుర్తుంచుకోలేకపోతాడు. ఒకవైపు జ్ఞాపకాలు లేని గతం, మరోవైపు ప్రాణప్రదమైన ప్రస్తుత ప్రేమ – ఈ రెండింటి మధ్య కృష్ణ పడే సంఘర్షణే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. మన భారతీయ గ్రంథాలలోని అంశాలను ఉపయోగించి అతను ఈ సమస్యను ఎలా అధిగమించాడు అనేది సినిమాలో ఆసక్తికరమైన అంశం.

ప్రధానంగా కృష్ణ, రాజు, కావ్య, దృశ్య నలుగురు ఫ్రెండ్స్ మధ్య కథ సాగుతుంది.

నటన:

* రఘు రామ్: కృష్ణ పాత్రలో రఘు రామ్ చాలా ఒదిగిపోయారు. గందరగోళానికి గురయ్యే యువకుడిగా, ప్రేమికుడిగా తన నటనతో మెప్పించాడు.

* శృతి శెట్టి & నైనా పాఠక్: హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ముఖ్యంగా సెంటిమెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో వీరి నటన ఆకట్టుకుంటుంది.

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: ఏకరి సత్యనారాయణ ఎంచుకున్న పాయింట్ చాలా వైవిధ్యంగా ఉంది. రఘురామ్ బడుగు రాసిన కథ ఆధునిక కాలంలో వస్తున్న రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఉంది. సైన్స్‌ను – మన ప్రాచీన విజ్ఞానాన్ని మేళవించి కథను నడిపించిన తీరు అభినందనీయం. కథ బ్యాక్ గ్రౌండ్ మనాలిలో జరగడం సినిమాకు మారింతా అందాన్ని తెచ్చింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, నదులు, దట్టమైన అడవుల దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

సంగీతం: నవనీత్ చారి అందించిన సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. భాష శ్రీ రాసిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి.

నిర్మాణ విలువలు: ఏకరి ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజీ పడకుండా ఈ చిత్రాన్ని క్వాలిటీగా నిర్మించారు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

* క్రోమోఫోబియా వంటి కొత్త పాయింట్‌ను టచ్ చేయడం.

* భారతీయ గ్రంథాలలోని గొప్పతనాన్ని కథలో భాగంగా చూపించడం.

* ప్రేమ, భావోద్వేగాల మధ్య ఉన్న బ్యాలెన్స్.

మైనస్ పాయింట్స్ :

కథలోని సస్పెన్స్‌ను మరికొంత కొనసాగించి ఉంటే బాగుండేదనిపించింది. ముఖ్యంగా కథానాయకుడికి ఉన్న ఫోబియా (భయం) గురించి అంత త్వరగా రివీల్ చేయకుండా ఉండాల్సింది. అలాగే, ఫైట్ సీక్వెన్స్‌లు ఆశించిన స్థాయిలో లేవు.

మొత్తానికి ‘ఓహ్’ (OH) చిత్రం కేవలం యువతకే కాకుండా, మన సంస్కృతిని, విజ్ఞానాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. వినూత్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్‌ని అందిస్తుందనడంలో సందేహం లేదు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ ఒక చక్కని రొమాంటిక్ డ్రామా ఇది.

ముఖ్య తారాగణం :

హీరో: రఘు రామ్

హీరోయిన్లు: శృతి శెట్టి, నైనా పాఠక్

సహాయ నటులు : కల్పగురి బిక్షపతి, మనోజ్,కరణ్,తదితరులు

మూవీ : “ఓహ్” (Oh)

బ్యానర్ : ఏకారి ఫిలిమ్స్

సమర్పణ : జీవిత బడుగు

దర్శక, నిర్మాత : సత్యనారాయణ ఏకారి,

కథ, కథనం, మాటలు: రఘు రామ్

సంగీతం :నవనీత్ చారి,

పాటలు : భాష్య శ్రీ

సినిమాటోగ్రఫీ : లక్కీ ఏకారి

కో- ప్రొడ్యూసర్స్: పి శ్రీకాంత్ రెడ్డి, వి రాఘవ్ రెడ్డి

కొరియోగ్రాఫర్ : రాజు మాస్టర్ (యస్. డి. సి )

పి.ఆర్. ఓ : ఆర్. కె చౌదరి

రేటింగ్ : 2.5/5

జగన్ బాంబు || Analist Chinta Rajasekhar EXPOSED Ys Jagan Koti Santakhala Rally || Vijayawada || TR