వైరల్ : “హరిహర వీరమల్లు” కి షాకిస్తున్న పవన్ డెడికేషన్.!

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే చిత్ర యూనిట్ ఇచ్చిన భారీ అప్డేట్ తో సినిమా పై మరిన్ని అంచనాలు అయితే నెలకొనగా ఈ భారీ ప్రాజెక్ట్ కి పవన్ కూడా స్పెషల్ డెడికేషన్ ఏ సినిమాకి కూడా చూపని విధంగా చూపించడం షాకింగ్ గా అనిపిస్తుంది.

మరి ఈ సినిమాలో పవన్ కి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ తో దర్శకుడు క్రిష్ భారీ ఏక్షన్ సీన్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి తాజాగా అయితే పవన్ కరాటే దుస్తుల్లో కనిపించడం షాకింగ్ గా మారింది. దీనితో అసలు పవన్ ఏం ప్రిపేర్ అవుతున్నాడా అని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనితో తాము కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ని మళ్లీ అయితే చూడబోతున్నామని ఫీల్ అవుతున్నారు.

ఇంకా ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా అయితే ఏ చిత్రాన్ని రిలీజ్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.