RGV: అప్పటివరకు వర్మను అరెస్ట్ చేయొద్దు… ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు!

RGV: సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో కేసులు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే గతంలో ఈయనం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవల రాంగోపాల్ వర్మ పోలీస్ కేసు నమోదు చేశారు. ఇలా ఈయన పై కేసు నమోదు కావడంతో కేసు కొట్టేయాలి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇక ఈ పిటిషన్ కోర్టు కొట్టివేసింది అనంతరం బెయిల్ పిటిషన్ వేయడంతో తరచూ ఈ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈయన పిటిషన్ కోర్టు విచారణ చేపడుతూ సంచలనమైన ఆదేశాలను జారీచేసింది. ఇలా వర్మ పిటిషన్ విచారించిన హైకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వచ్చే సోమవారం వరకు ఈయనని అరెస్టు చేయొద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విధంగా రాంగోపాల్ వర్మ అరెస్టు గురించి కోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ఇవ్వడంతో ఈయనకు కాస్త ఊరట కలిగించింది అని చెప్పాలి అయితే మళ్ళీ సోమవారం తర్వాత ఈయన పిటిషన్ విచారణ జరిపి తనకు బెయిల్ ఇస్తారా లేకపోతే ఈ పిటిషన్ కొట్టి వేసే ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ఇక వర్మ అరెస్టు భయంతోనే పారిపోయారని అజ్ఞాతంలో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు తాను ఎక్కడికి పారిపోలేదు, తాను తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వీడియోలను విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు..

ఇక తాను అరెస్ట్ అయితే కనుక పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని అందుకే తనకు బెయిల్ కావాలని వర్మ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికైతే ఈయనకు కాస్త ఊరట కలిగించిన వచ్చే సోమవారం కోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.